'స్వాతంత్ర్యం ఇచ్చేందుకు మేం ఒప్పుకోం'
న్యూయార్క్: బెలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి తాము ఒప్పుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్ సమైక్యతను తాము గౌరవిస్తామని అమెరికా సహాయ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. బెలూచిస్తాన్ ప్రాంతంలో సామాన్యుల హక్కులను కాలరాస్తూ హింసాత్మక చర్యలకు పాక్ బలగాలు పాల్పడుతున్న నేపథ్యంలో అటు అక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం అవసరం అని డిమాండ్ పెరుగుతుంది కదా..!
దీనిని మీరెలా సమర్థిస్తారు అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. 'పాక్ దేశ సమైక్యతను, కలిసి ఉండటాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పటికీ గౌరవిస్తుంది. బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని మేం ఏ మాత్రం అంగీకరించం' అని ఆయన అన్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్రమోదీ బెలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అమెరికా వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేశారు.