పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 359కి చేరిందని ఉన్నతాధికారి జన్ మహ్మద్ బులెది శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో గాయపడిన వారు 755 మంది వరకు ఉన్నారని తెలిపారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భుకంపం సంభవించిన మారుమూల ప్రాంతాల్లో భద్రత సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారని వివరించారు.
భూకంపం ధాటికి బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని అవారన్, కచ్ జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయని బులెది తెలిపారు. అయితే రెండు జిల్లాలో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోమంగళవారం భూకంపం సంభవించింది. రిక్టారె స్కేల్పై 7.7గా నమోదు అయింది. ఆ భూకంపం ధాటికి రోడ్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టడానికి తీవ్ర జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే.