సోచి: నేటి (శుక్రవారం) నుంచి రష్యాలో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన సోచి నగరంలో జరిగే ఈ క్రీడాపోటీల్లో నేడు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం నుంచి ఈనెల 23 వరకు పోటీలుండగా 15 ఈవెంట్లలో ఆయా దేశాల ఆటగాళ్లు పోటీపడనున్నారు.
వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన గేమ్స్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు 65 దేశాలకు చెందిన ప్రపంచ అగ్రస్థాయి నాయకులు హాజరుకానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీరిలో కెనడా, ఇంగ్లండ్ ప్రధానులతో పాటు అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ అధ్యక్షులున్నట్టు సమాచారం. భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారు.
నేటి నుంచి వింటర్ ఒలింపిక్స్
Published Fri, Feb 7 2014 1:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement