ఒలింపిక్ గేమ్స్ ఫైల్ ఫోటో
క్రీడాభిమానులకు రిలయన్స్ జియో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. రేపటినుంచి ప్రారంభం కానున్న (ఫిబ్రవరి 9) పియాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ 2018ను పాపులర్ జియో టీవీ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 9-25వ తేదీవరకు దక్షిణ కోరియాలో అట్టహాసంగా నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ లైవ్ అప్‌డేట్స్‌ను దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా అందించనున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను పియాంగ్ చాంగ్ 2018 ఒలింపిక్ కమిటీనుంచి సాధించామని వెల్లడించింది.
జియో టీవీ యాప్‌లో లైవ్ కవరేజీని అందించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆటల సమగ్ర కవరేజీని అందించడానికి ఐవోసీతో కలిసి జియో టీవీ పనిచేస్తుంది, తద్వారా లక్షలాది మంది తమ మొబైల్స్‌లో లైవ్ అండ్ క్యాచ్-అప్ కంటెంట్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మొట్టమొదటి, కీలక ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్ దీవుల్లో కూడా ఆసియా ఫసిఫిక్ యూనియన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఐవోసీ ప్రకటించింది.
వందల కోట్ల ఖర్చుతో సరికొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన భారీ స్టేడియంలో ‘ఒలింపిక్ వింటర్ గేమ్స్ 2018’ దక్షిణ కొరియా, పియాంగ్ చాంగ్ కౌంటీలో జరుగనున్నాయి. స్కీయింగ్, స్కేటింగ్, ల్యుగే, స్కై జంపింగ్, ఐస్ హాకీ, మంచు బోర్డింగ్ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భారతదేశంతో సహా 90కి పైగా దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి. కాగా ఆండ్రాయిడ్‌లో రిలయన్స జియో టీవీ యాప్ లక్షల డోన్‌లోడ్‌లను కలిగింది. సుమారు 400 చానల్స్‌ను, 60హెచ్‌డీ చానల్స్‌ను వీక్షించే అవకాశాన్ని చందాదారులకు అందిస్తోంది. తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, గుజరాతి, ఒడియ, భోజ్‌పురి, కన్నడ, అస్సామీ, నేపాలీ, ఫ్రెంచ్ లాంటి వివిధ భాషలలోని ఛానెళ్లకు జియో టీవీ యాప్‌లో యాక్సెస్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment