సోషల్ మీడియాలో ఇటీవల పలు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, డేరింగ్ ఛాలెంజ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ వ్యక్తులు వరకు ప్రతిఒక్కరూ వాటిని చేసి చూపిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరడం వంటివి చేస్తారు. మొదట ఐస్ కూలింగ్ బకెట్ ఛాలెంజ్ అంటూ మొదలై అలా పలు రకాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఫిట్‌నెస్ పరంగానూ ఆరోగ్యపరంగానూ మంచివి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రమాదకర స్టంట్‌లే లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి రిస్కీ ఛాలెంజ్ ఫేస్ చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ ఇన్‌ఫ్లుయెన్సర్. ఏంటా ఛాలెంజ్? అంత డేంజరా అంటే..?
చైనాలోని పాన్ జియోటింగ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఆన్‌లైన ఛాలెంజ్‌లను తీసుకోవడం అంటే మహా సరదా. అలాంటివి ఎన్నో ఛాలెంజ్‌లు తీసుకుంది. అలానే ఇటీవల ఆమె ఈటింగ్ ఛాలెంజ్ తీసుకుంది. దీన్ని లైవ్‌లో చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఛాలెంజ్‌లో జియోటింగ్ పదిగంటలకు పైగా ఎక్కువసేపు తినవలసి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందికరమైనది వద్దు అని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు హెచ్చరించినా..పది కిలోలకు పైగా ఆహారాన్ని తినేందుకు ఉపక్రమించింది.
ఒక దశలో ఆమె శరీరం హెవీ ఫుడ్‌ని తట్టుకోలేకపోవడంతో చివరికీ ఆమె మరణానికి దారితీసింది. అంతేగాదు పోస్ట్‌మార్టం రిపోర్టులో డా ఆమె కడుపు వైకల్యంతో మరణించిందని రావడం గమనార్హం. ఆమె కడుపులో జీర్ణకానీ ఆహారం పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో మరణించిందని పోస్టమార్టం రిపోర్టులో తేలింది. అతిగా తినడం ఇంత ప్రమాదకరమైనదా అంటే..
కొంతమంది రుచిలో మైమరిచి బాగా లాగించేస్తుంటారు. అలాగే అతని బ్రెయిన్ సైతం నచ్చిన ఫుడ్‌ని చూసి బాగా తినేలా ప్రేరేపించేస్తుంది. దీంతో కంట్రోల్ లేకుండా తింటాం. ఇలాంటప్పుడూ వెంటనే భయానక సమస్యలు రావుగానీ. పనిగట్టుకుని ఇలా పెద్ద మొత్తంలో ఆహారం తీసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా పెద్ద మొత్తంలో పొట్టలోకి ఆహారాన్ని పంపిస్తారో అప్పుడూ గ్యాస్ట్రిక్, ఆమ్లత్వం, కడుపునొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి ఎదురవ్వుతాయి.
అదీగాక జీర్ణశయం కూడా అంత మొత్తంలోని ఆహారాలను జీర్ణించుకోలేకపోతుంది. పైగా ఆ ఆహారం కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం లేదా అధిక బరువు వంటి వాటికి దారితీసి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పెద్ద మొత్తంలో తినాలన్నా ఆత్రుతలో సరిగా నమలితినం. దీంతో ఆహారం సాఫీగా జీర్ణం గాక పొట్ట బరువై ఉక్కిరిబిక్కరిగా అయిపోయి ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఆహారం విషయంలో మనసుపెట్టి బాగా నమిలి ఆస్వాదిస్తూ మితంగా తీసుకోవడమే మంచిదని లేదంటే లేనిపోని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. అంతేగా ఫుడ్ ఛాలెంజ్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.
(చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!)
Comments
Please login to add a commentAdd a comment