JioTV
-
జియోటీవీలో అమర్ నాథ్ 'హారతి' ప్రత్యక్ష ప్రసారం
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది దైవ ప్రియలు తమ ఇష్ట దైవలను సందర్శించ లేకపోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమర్ నాథ్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఒక శుభవార్త తెలిపింది. మనదేశంలో పవిత్రం మందిరం అయిన అమర్ నాథ్ పుణ్య క్షేత్రన్ని భౌతిక దర్శించలేని భక్తుల సహాయ పడటానికి జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. మనదేశంలో అత్యంత క్లిష్టమైన భూభాగంలో ఉన్న అమర్ నాథ్ దగ్గర ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికి ప్రత్యక్ష ప్రసారానికి సపోర్ట్ చేసే నెట్ వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. గత వారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భక్తులకు వ్యక్తిగత అనుభవాన్ని అందించడానికి అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు వివిధ ఆన్ లైన్(http://www.shriamarnathjishrine.com/) సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. "కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది శ్రీ అమర్ నాథ్ జీ పవిత్ర మందిరాన్ని సందర్శించలేని లక్షలాది మంది భక్తులకు, పుణ్యక్షేత్రం బోర్డు వర్చువల్ మోడ్ కింద దర్శనం, హవాన్, ప్రసాద్ సౌకర్యాన్ని అందిస్తుంది. భక్తులు తమ పూజ, హవాన్, ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. పవిత్ర గుహ వద్ద ఉన్న పూజారులు భక్తుడి పేరిట దానిని అందిస్తారు. ప్రసాదం తర్వాత భక్తుల ఇంటికి డెలివరీ చేయనున్నట్లు" బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు కొత్తగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివుడి భక్తులు పవిత్ర గుహ వద్ద ఆన్ లైన్ లో వర్చువల్ గా 'పూజ', 'హవాన్' నిర్వహించవచ్చు. తాజాగా రిలయన్స్ జియో జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూర్చడం కోసం జియోకు చెందిన JioTV, JioMeet, JioSaavn, JioChat వంటి యాప్స్ ద్వారా ఈ సేవలను ప్రవేశపెట్టింది. జియోటీవీలోని ప్రత్యేక ఛానెల్ లో అమర్ నాథ్ హారతి ప్రత్యక్ష ప్రసారం, జియోమీట్ ద్వారా వర్చువల్ పూజ, హవాన్ అందిస్తుంది. భక్తులు పుణ్యక్షేత్రంలో పూజారితో వర్చువల్ రూపంలో పూజా గదిలో పాల్గొనడం, వారి పేరు, 'గోత్ర'లో హవాన్/పూజను నిర్వహించుకోవచ్చు. ఇక జియో సావన్ లో అమర్ నాథ్ పుణ్య క్షేత్రానికి చెందిన పాటలు ప్లే కావడం, జియో చాట్ ద్వారా ప్రత్యక్ష దర్శనంతో పాటు హారతి సమయం, విరాళాలు పంపవచ్చు. -
జియోటీవీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయ ప్రజలు రేపు ఎప్పుడొస్తుందా? అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచే మెగా స్పోర్ట్స్ ఈవెంట్లు ఫిఫా వరల్డ్ కప్, భారత-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. వీటిని తిలకించేందుకు యువతను మరింత ప్రోత్సహించడానికి రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేపటి(గురువారం) నుంచి 18వ తేదీ వరకు జరగబోయే ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌ను ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచీ జియోటీవీ యాప్‌లో లైవ్‌బ్రాడ్‌కాస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాక జరగబోయే ఫిఫా వరల్డ్ కప్‌ను కూడా ఇది లైవ్‌గా బ్రాడ్కాస్ట్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రీమియం కంటెంట్ అంతటిన్నీ జియో యూజర్లందరికి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. కంటెంట్ దిగ్గజాలు, బ్రాడ్కాస్టర్లతో కలిసి ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌తో కంటెంట్ పోర్ట్‌ఫోలియోను జియో బలపరుస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. అంతేకాక తన 13 కోట్ల మంది జియో టీవీ యూజర్లకు వచ్చే కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన ఆఫర్లతో పాటు, పలు ప్రయోజనాలను అందించనుందని తెలిపాయి. ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన డబుల్ ధమాకా ఆఫర్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లు అదనంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందుతున్నారు. -
క్రీడాభిమానులకు జియో గుడ్‌న్యూస్
క్రీడాభిమానులకు రిలయన్స్ జియో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. రేపటినుంచి ప్రారంభం కానున్న (ఫిబ్రవరి 9) పియాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ 2018ను పాపులర్ జియో టీవీ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 9-25వ తేదీవరకు దక్షిణ కోరియాలో అట్టహాసంగా నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ లైవ్ అప్డేట్స్ను దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా అందించనున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను పియాంగ్ చాంగ్ 2018 ఒలింపిక్ కమిటీనుంచి సాధించామని వెల్లడించింది. జియో టీవీ యాప్‌లో లైవ్ కవరేజీని అందించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆటల సమగ్ర కవరేజీని అందించడానికి ఐవోసీతో కలిసి జియో టీవీ పనిచేస్తుంది, తద్వారా లక్షలాది మంది తమ మొబైల్స్‌లో లైవ్ అండ్ క్యాచ్-అప్ కంటెంట్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మొట్టమొదటి, కీలక ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్ దీవుల్లో కూడా ఆసియా ఫసిఫిక్ యూనియన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఐవోసీ ప్రకటించింది. వందల కోట్ల ఖర్చుతో సరికొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన భారీ స్టేడియంలో ‘ఒలింపిక్ వింటర్ గేమ్స్ 2018’ దక్షిణ కొరియా, పియాంగ్ చాంగ్ కౌంటీలో జరుగనున్నాయి. స్కీయింగ్, స్కేటింగ్, ల్యుగే, స్కై జంపింగ్, ఐస్ హాకీ, మంచు బోర్డింగ్ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భారతదేశంతో సహా 90కి పైగా దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి. కాగా ఆండ్రాయిడ్‌లో రిలయన్స జియో టీవీ యాప్ లక్షల డోన్లోడ్లను కలిగింది. సుమారు 400 చానల్స్‌ను, 60హెచ్డీ చానల్స్‌ను వీక్షించే అవకాశాన్ని చందాదారులకు అందిస్తోంది. తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, గుజరాతి, ఒడియ, భోజ్‌పురి, కన్నడ, అస్సామీ, నేపాలీ, ఫ్రెంచ్ లాంటి వివిధ భాషలలోని ఛానెళ్లకు జియో టీవీ యాప్‌లో యాక్సెస్ లభిస్తుంది. -
డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోయిన మైజియో
రిలయన్స్ జియోకి ముఖ్యమైన మొబైల్ అప్లికేషన్ 'మైజియో' కి పెరుగుతున్న క్రేజీ అంతా ఇంతా కాదు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ 100 మిలియన్(10 కోట్ల) మార్కును దాటేసింది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసు హాట్‌స్టార్ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇంతలా డౌన్లోడ్ అయిన రెండో దేశీయ అప్లికేషన్ ఇదే కావడం విశేషం. ఈ అప్లికేషన్‌కు యావరేజ్‌గా 4.4 స్టార్ రేటింగ్ ఉంది. జియో సబ్స్క్రైబర్లందరికీ ఇది కామన్ ప్లాట్‌ఫామ్. జియో కనెక్షన్ చెక్ చేసుకోవడానికి, డేటా వాడకం తెలుసుకోవడం కోసం ఇది ఎంతో సహకరిస్తోంది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు- ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ల సెల్ఫ్-కేర్ అప్లికేషన్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్(కోటి) పైగా డౌన్లోడ్లను నమోదుచేసింది. రిలయన్స్ జియో టీవీ యాప్, జియో టీవీ కూడా 50 మిలియన్(5 కోట్ల) డౌన్లోడ్లను రికార్డు చేసినట్టు వెల్లడైంది. కాగ, ఎయిర్టెల్ టీవీ యాప్ 5 మిలియన్ పైగా డౌన్లోడ్లు, వొడాఫోన్, ఐడియాలకు ఒక్కో దానికి 1 మిలియన్‌కు పైగా డౌన్లోడ్లను కలిగి ఉన్నట్టు తెలిసింది. జీరోకే జియో ఫోన్ లాంచింగ్‌తో టెలికాం వ్యాపారాల్లో రిలయన్స్ జియో మరింత మార్కెట్ షేరును విస్తరించేందుకు చూస్తోంది. ప్రస్తుతం మార్చి నెలలో 9.9 మార్కెట్ షేరును జియో కలిగి ఉంది. అంతేకాక టీవీ మార్కెట్లోనూ దేశవ్యాప్తంగా 15 స్థానిక భాషల్లో 432 లైవ్ ఛానల్స్‌ను జియో టీవీ యాప్ ఆఫర్ చేస్తోంది. తమ యూజర్లకు జియో టీవీ సర్వీసులను అందించేందుకు హాట్‌స్టార్‌తో ఇది భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. -
మరో సంచలనానికి రిలయన్స్ రెడీ
ముంబై: జియో 4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది. హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో ఒక జీబీపీస్ వరకు ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది. అయితే ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది. జియో టీవీ ద్వారా 360పైగా చానళ్లు (ఇందులో కనీసం 50 హెచ్ డీ చానళ్లు) వీక్షకులకు అందుబాటులో ఉంచనుంది. తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లతో సేవ్ చేసుకోవచ్చు. మాటలతో పనిచేసే రిమోట్ తో తమకు కావాల్సిన చానల్ మార్చుకోవచ్చు. అంతేకాదు కార్యక్రమం, కేటగిరి, నటీనటుల పేరు చెప్పి రిమోట్ ను ఆపరేట్ చేసే విధంగా ఫీచర్లు పొందుపరచనున్నట్టు తెలుస్తోంది.