ట్రంప్, కిమ్ వేషధారణల్లో వింటర్ ఒలింపిక్స్‌కు హాజరైన హోవార్డ్ ఎక్స్(ఎడమ), డెన్నిస్ అలన్(కుడి)
ప్యాంగ్ చాంగ్, దక్షిణకొరియా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలసి దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో జరగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఇది నిజంగానే జరిగితే బావుటుంది.
కిమ్, ట్రంప్‌లు కలసి వస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు(హోవార్డ్ ఎక్స్, డెన్నిస్ అలన్) అచ్చూ ట్రంప్, కిమ్‌ల మారువేషాలతో వింటర్ ఒలింపిక్స్‌కు వచ్చారు. తొలుత వారిని చూసిన ఒలింపిక్స్ నిర్వహకులు వారి కళ్లను నమ్మలేకపోయారు. ఆనందంతో ఇద్దరికి లోపలికి సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే, క్రీడాకారులను దగ్గరగా చూసేందుకు జర్నలిస్టుల గ్యాలరీలోకి వెళ్లేందుకు ఇరువురూ యత్నించారు.
దీన్ని గమనించిన నిర్వహకులు ఇరువురిని వారి సీట్ల వద్దకు తీసుకెళ్లారు. ట్రంప్, కిమ్ గెటప్‌లలో ఉన్న ఇద్దరితో మాట్లాడేందుకు జర్నలిస్టులు వారి వెనుక పరుగులు పెట్టారు. నకిలీ ట్రంప్, కిమ్‌ల ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్‌లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment