ముగిసిన వింటర్ ఒలింపిక్స్
సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. పదిహేడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా అత్యధికంగా 13 స్వర్ణాలతోపాటు మొత్తం 33 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున ముగ్గురు అథ్లెట్లు పాల్గొన్నా ఒక్క పతకమూ నెగ్గని సంగతి తెలిసిందే. 2018 వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం ఆతిథ్యమిస్తుంది.
త్రివర్ణ రెపరెపలు: భారత్‌పై ఐఓసీ నిషేధం ఎత్తివేయడంతో వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకంతో పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్లు ఐఓసీ పతాకంతో పాల్గొన్న సంగతి తెలిసిందే.