
తన వింటర్ ఒలింపిక్స్ కెరీర్‌ను భారత క్రీడాకారుడు శివ కేశవన్ నిరాశగా ముగించాడు. ల్యూజ్ క్రీడాంశంలో శివ 34వ స్థానంలో నిలిచాడు. 40 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఆదివారం జరిగిన మూడో రేసును శివ 48.900 సెకన్లలో పూర్తి చేశాడు. టాప్–20లో నిలిచిన వారు ఫైనల్ రేసుకు అర్హత సాధించారు. వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న 36 ఏళ్ల శివ 2014 సోచి ఒలింపిక్స్‌లో 37వ స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment