షర్ట్‌లెస్ టోంగన్‌ మళ్లీ వచ్చేశాడు.. వైరల్ | Shirtless Tongan Pita Taufatofua trending in social media | Sakshi
Sakshi News home page

షర్ట్‌లెస్ టోంగన్‌ మళ్లీ వచ్చేశాడు.. వైరల్

Published Fri, Feb 9 2018 6:15 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Shirtless Tongan Pita Taufatofua trending in social media - Sakshi

ఆటగాడు పిటా టఫాటోఫౌ

సియోల్: పిటా టఫాటోఫౌ.. ఆ పేరు వినగానే రియో ఒలింపిక్స్ గుర్తురాక మానదు. ఎందుకంటే బ్రెజిల్‌లోని రియోడీజనీరోలో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ‘షర్ట్‌లెస్’గా ఒంటినిండా నూనెతో కనిపించిన తైక్వాండో ఆటగాడే ఈ టఫాటోఫౌ. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోంగకు చెందిన ఈ ఆటగాడు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఒలింపిక్స్‌లో మెడల్‌ సంగతేమోకానీ అంతకుముందే..  అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొడుతున్నాడు తైక్వాండో ఆటగాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రావడంతో అందరి దృష్టి అతడిపై నెలకొంది.

రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో టోంగన్ సంప్రదాయ వేషధారణలో కనిపించి.. తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా పిటా నిలిచిన విషయం తెలిసిందే. షర్ట్‌ లేకుండా ఒంటినిండా నూనెతో, కండలు తిరిగిన దేహంతో అతిపెద్ద స్డేడియంలో అతడు ఎంతోమంది మహిళా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన పిటా.. సమ్మర్ (రియో)తో పాటు నేటి వింటర్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన తొలి టోంగన్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించనున్నాడు.

‘రియో తర్వాత ఎంతో ఆలోచించాను. కొత్త చాలెంజ్‌ను ఏర్పాటు చేసుకున్నా. కొత్త గేమ్ ద్వారా మళ్లీ ఒలింపిక్స్‌లో టోంగన్ తరపున బరిలోకి దిగాలని భావించా. దానికోసం ఐస్‌లాండ్‌కు వెళ్లి తీవ్రంగా శ్రమించి ప్రాక్టీస్ చేశాను. క్రాస్ కంట్రీ స్కైయింగ్‌కు అర్హత సాధించాను. పతకం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని’  టఫాటోఫౌ తెలిపాడు.







         
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement