oily shirtless man
-
షర్ట్‌లెస్ టోంగన్ మళ్లీ వచ్చేశాడు.. వైరల్
సియోల్: పిటా టఫాటోఫౌ.. ఆ పేరు వినగానే రియో ఒలింపిక్స్ గుర్తురాక మానదు. ఎందుకంటే బ్రెజిల్‌లోని రియోడీజనీరోలో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ‘షర్ట్‌లెస్’గా ఒంటినిండా నూనెతో కనిపించిన తైక్వాండో ఆటగాడే ఈ టఫాటోఫౌ. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోంగకు చెందిన ఈ ఆటగాడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఒలింపిక్స్‌లో మెడల్ సంగతేమోకానీ అంతకుముందే.. అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొడుతున్నాడు తైక్వాండో ఆటగాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రావడంతో అందరి దృష్టి అతడిపై నెలకొంది. రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో టోంగన్ సంప్రదాయ వేషధారణలో కనిపించి.. తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా పిటా నిలిచిన విషయం తెలిసిందే. షర్ట్ లేకుండా ఒంటినిండా నూనెతో, కండలు తిరిగిన దేహంతో అతిపెద్ద స్డేడియంలో అతడు ఎంతోమంది మహిళా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన పిటా.. సమ్మర్ (రియో)తో పాటు నేటి వింటర్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన తొలి టోంగన్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించనున్నాడు. ‘రియో తర్వాత ఎంతో ఆలోచించాను. కొత్త చాలెంజ్‌ను ఏర్పాటు చేసుకున్నా. కొత్త గేమ్ ద్వారా మళ్లీ ఒలింపిక్స్‌లో టోంగన్ తరపున బరిలోకి దిగాలని భావించా. దానికోసం ఐస్లాండ్కు వెళ్లి తీవ్రంగా శ్రమించి ప్రాక్టీస్ చేశాను. క్రాస్ కంట్రీ స్కైయింగ్‌కు అర్హత సాధించాను. పతకం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని’ టఫాటోఫౌ తెలిపాడు. -
ఈ కండల వీరుడి కవాతుపై కితకితలు!
తైక్వాండో ఆటగాడు పిటా నికోలస్ టఫాటోఫౌ ఈసారి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచినా.. గెలువకపోయినా.. అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టాడు. అట్టహాసంగా వైభవోపేతంగా జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా పిటా నిలిచాడు. నిన్నమొన్నటివరకు టోంగా దేశం ఉందనే విషయం చాలామందికి తెలిసే అవకాశం లేకపోవచ్చుగానీ.. చొక్కా విప్పేసి.. కండలకు మాంఛిగా నూనె పట్టి.. టోంగా ఆటగాళ్ల బృందం తరఫున జెండా పట్టుకొని కవాతు చేసిన పిటా అందరి దృష్టి ఆకర్షించాడు. టోంగా సంప్రదాయ వేషధారణలో అతను చేసిన కవాతుపై ట్విట్టర్లో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటివరకు టోంగా ఎక్కడుందో ఎవరికీ తెలియకపోయినా.. ఇక అమ్మాయిలంతా టోంగాకు క్యూ కడతారని, రానున్న రెండువారాలూ అమ్మాయిల గుండెల్లో పిటా చైర్ వేసుకొని కూర్చుంటాడని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. రిక్షా తొక్కిన సౌదీ చిన్నది! ఇక సంప్రదాయ దేశమైన సౌదీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ కవాతు సందర్భంగా కొంత వినూత్నంగా కొంత విచిత్రంగా వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. సౌదీ అరేబియా బోర్డు, చెట్లు, మొక్కలు ఉన్న రిక్షాను తొక్కుతూ క్రీడాకారిణి మారకానా తమ బృందాన్ని ముందుకు నడిపింది. మహిళలు పార్కుల్లో సైకిల్ తొక్కేందుకు సౌదీ మతగురువులు 2013లో అనుమతి ఇచ్చారు. ఆ ప్రకారమే మొక్కలతో ఉన్న రిక్షాను క్రీడాకారిణి తొక్కుతూ ముందుకు సాగింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారి తమ దేశం తరఫున మహిళలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సౌదీ అనుమతిచ్చింది. అప్పట్లో ఇద్దరు క్రీడాకారుణులు పాల్గొనగా.. ఇప్పుడు 12మంది మగువలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.