ఈ కండల వీరుడి కవాతుపై కితకితలు! | Tonga were led out by this oily shirtless man at the Olympics opening ceremony | Sakshi
Sakshi News home page

ఈ కండల వీరుడి కవాతుపై కితకితలు!

Published Sat, Aug 6 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ఈ కండల వీరుడి కవాతుపై కితకితలు!

ఈ కండల వీరుడి కవాతుపై కితకితలు!

తైక్వాండో  ఆటగాడు పిటా నికోలస్‌ టఫాటోఫౌ ఈసారి ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచినా.. గెలువకపోయినా.. అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టాడు. అట్టహాసంగా వైభవోపేతంగా జరిగిన రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా పిటా నిలిచాడు.

నిన్నమొన్నటివరకు టోంగా దేశం ఉందనే విషయం చాలామందికి తెలిసే అవకాశం లేకపోవచ్చుగానీ.. చొక్కా విప్పేసి.. కండలకు మాంఛిగా నూనె పట్టి.. టోంగా ఆటగాళ్ల బృందం తరఫున జెండా పట్టుకొని కవాతు చేసిన పిటా అందరి దృష్టి ఆకర్షించాడు. టోంగా సంప్రదాయ వేషధారణలో అతను చేసిన కవాతుపై ట్విట్టర్‌లో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.

నిన్నటివరకు టోంగా ఎక్కడుందో ఎవరికీ తెలియకపోయినా.. ఇక అమ్మాయిలంతా టోంగాకు క్యూ కడతారని, రానున్న రెండువారాలూ అమ్మాయిల గుండెల్లో పిటా చైర్‌ వేసుకొని కూర్చుంటాడని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

రిక్షా తొక్కిన సౌదీ చిన్నది!
ఇక సంప్రదాయ దేశమైన సౌదీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్‌ కవాతు సందర్భంగా కొంత వినూత్నంగా కొంత విచిత్రంగా వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. సౌదీ అరేబియా బోర్డు, చెట్లు, మొక్కలు ఉన్న రిక్షాను తొక్కుతూ క్రీడాకారిణి మారకానా తమ బృందాన్ని ముందుకు నడిపింది. మహిళలు పార్కుల్లో సైకిల్‌ తొక్కేందుకు సౌదీ మతగురువులు 2013లో అనుమతి ఇచ్చారు. ఆ ప్రకారమే మొక్కలతో ఉన్న రిక్షాను క్రీడాకారిణి తొక్కుతూ ముందుకు సాగింది.

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి తమ దేశం తరఫున మహిళలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సౌదీ అనుమతిచ్చింది. అప్పట్లో ఇద్దరు క్రీడాకారుణులు పాల్గొనగా.. ఇప్పుడు 12మంది మగువలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement