కెమెరాను 'గే'లిచారు.. | Televised Gay Kiss Lights Up Winter Olympics | Sakshi

కెమెరాను 'గే'లిచారు..

Published Mon, Feb 19 2018 1:51 PM | Last Updated on Mon, Feb 19 2018 2:04 PM

Televised Gay Kiss Lights Up Winter Olympics - Sakshi

సియోల్‌: దక్షిణాకొరియాలో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్రీస్టైల్ స్కైయెర్ గస్‌ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆదివారం స్లోప్‌స్టైయిల్‌ ఈవెంట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెన్‌వర్తీ..తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తూ కెమెరాను మాత్రం 'గే' లిచాడు.

సాధారణంగా ఎవరైనా అత్యుత్తమ ప్రదర్శన చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ దృష్టి సారించే కెమెరాలు..కెన్‌వర్తీ 12వ స్థానంలో నిలిచినా మొత్తం అతన్నే టార్గెట్‌ చేశాయి. అందుకు కారణం అతని బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకోవడమే. ఎవరికైనా ప్రేమ అనేది ప్రేమే కాబట్టి ఈ జోడి ఒకరినొకరు అభినందించుకునే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయారు. అంతే కెమెరాలన్నీ ఒక్కసారిగా వీరి వైపు తిరిగాయి. తమ కెమెరాల్లో బంధిస్తూ ఏదో అద్భుతం జరుగుతుదేమో అనేంతంగా పోటీ పడి క్లిక్‌లు మీద క్లిక్‌లు కొట్టాయి. ఆపై ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కెన్‌వర్తీ వెలుగులోకి వచ్చాడు. దీనిపై సోమవారం ట్వీట్‌ చేసిన కెన్‌వర్తీ..' ఈ మూమెంట్‌ను కెమెరాలో బంధిస్తారని అనుకోలేదు. ఈ రకంగా మా గురించి ప్రపంచానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో ఎప్పుడూ గే కిస్‌ను టీవీల్లో చూడలేదు. ఇదే తొలిసారి కావొచ్చు. ఒక  పిల్లాడు ఇంట్లో కూర్చొని మా ప్రేమను చూసే అవకాశం కల్పించారు' అని కెన్‌వర్తీ సంతోషం వ్యక్తం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement