సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్‌లో తెలంగాణకు రెండో పతకం లభించింది. గచి్చ»ౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది.
మహిళల 200 మీటర్ల మెడ్లే విభాగంలో హషిక రామచంద్ర (కర్ణాటక) కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. హషిక 2ని:21.15 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలువడంతోపాటు 2010 నుంచి రిచా మిశ్రా (2ని:23.62 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఆర్యన్ నెహ్రా (గుజరాత్; 8ని:01.81 సెకన్లు), మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అనన్య నాయక్ (మహారాష్ట్ర; 57.31 సెకన్లు) కూడా స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు కొత్త జాతీయ
రికార్డులు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment