national swimming
-
కాంస్యం నెగ్గిన వ్రితి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణకు రెండో పతకం లభించింది. గచి్చ»ౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది. మహిళల 200 మీటర్ల మెడ్లే విభాగంలో హషిక రామచంద్ర (కర్ణాటక) కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. హషిక 2ని:21.15 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలువడంతోపాటు 2010 నుంచి రిచా మిశ్రా (2ని:23.62 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఆర్యన్ నెహ్రా (గుజరాత్; 8ని:01.81 సెకన్లు), మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో అనన్య నాయక్ (మహారాష్ట్ర; 57.31 సెకన్లు) కూడా స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు కొత్త జాతీయ రికార్డులు సృష్టించారు. -
స్విమ్మింగ్ విన్యాసాలు (ఫొటోలు)
-
జాతీయ స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
అనంతపురం సప్తగిరి సర్కిల్: జాతీయ స్విమ్మింగ్ పోటీలకు జిల్లాకు చెందిన సుంకు.రిషి, భానుప్రకాష్రెడ్డిలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారన్నారు. జిల్లాకు చెందిన సుంకు.రిషి 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో 1.23 నిమిషాలల్లో పూర్తి చేసి బంగారు పతకాన్ని, 200 మీటర్ల బటర్‌ఫ్లైలో రజతం, 200 మీటర్ల ఇండివిజ్యువల్ మిడ్లేలో రజతం సాధించాడన్నారు. భానుప్రకాష్‌రెడ్డి 400 మీటర్ల ఇండివిజ్యువల్ మిడ్లే విభాగాన్ని 5.45 నిమిషాలల్లో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారన్నారు. వీరు నవంబర్‌లో గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జరిగే 62వ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని చాటాలని రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌లు కోరారు.