జాతీయ స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
Published Wed, Oct 19 2016 1:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్: జాతీయ స్విమ్మింగ్ పోటీలకు జిల్లాకు చెందిన సుంకు.రిషి, భానుప్రకాష్‌రెడ్డిలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారన్నారు.
జిల్లాకు చెందిన సుంకు.రిషి 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో 1.23 నిమిషాలల్లో పూర్తి చేసి బంగారు పతకాన్ని, 200 మీటర్ల బటర్‌ఫ్లైలో రజతం, 200 మీటర్ల ఇండివిజ్యువల్ మిడ్‌లేలో రజతం సాధించాడన్నారు. భానుప్రకాష్‌రెడ్డి 400 మీటర్ల ఇండివిజ్యువల్ మిడ్‌లే విభాగాన్ని 5.45 నిమిషాలల్లో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారన్నారు. వీరు నవంబర్‌లో గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జరిగే 62వ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని చాటాలని రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌లు కోరారు.
Advertisement
Advertisement