కౌలాలంపూర్: ప్రపంచ క్రీడల చరిత్రలో చైనా రాజధాని బీజింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2008లో సమ్మర్ ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన బీజింగ్... 2022 వింటర్ ఒలింపిక్స్‌కూ ఆతిథ్యమివ్వనుంది. దీంతో రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన నగరంగా బీజింగ్ రికార్డులకెక్కనుంది. పోటీల వేదికను ఖరారు చేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. బిడ్డింగ్‌లో బీ జింగ్ 44 ఓట్లు సాధించగా... చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన కజకిస్తాన్‌కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు దేశాలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనగా... రకరకాల కారణాలతో నాలుగు దేశాలు వైదొలిగాయి.