south kora
-
దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం
సియోల్: దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ మనస్సు ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకున్న ఆయన ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్చాంగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం సోమవారం రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. -
మరింత రెచ్చిపోతాడా?
సాక్షి : ఉత్తర కొరియా అణు పరీక్షలను అంతర్జాతీయ సమాజం మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా అధ్యక్షుడు కిమ్ జంగ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. వరుసగా అణు క్షిపణులను ప్రయోగిస్తూ పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. పద్ధతి మార్చుకోకపోతే యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మున్ముందు కిమ్ కవ్వింపు చర్యలు పెరిగే ఆస్కారం ఉందన్న సంకేతాలను దక్షిణ కొరియా అందజేస్తోంది. అక్టోబర్ నెలలో డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వార్షికోత్సవ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా 10, 18 తేదీల్లో ప్యోంగ్యాంగ్లో నిర్వహించబోయే వేడుకల్లో క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ద.కొ. అంచనా వేస్తోంది. గురువారం అధ్యక్షుడు మూన్ జాయె ఇన్‌తో భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యూ యోంగ్ ఓ ప్రకటన చేశారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పరిస్థితి యుద్ధానికి దారి తీయవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా మాదిరి యుద్దానికి తామూ ఉవ్విళ్లూరటం లేదన్న విషయాన్ని ఇప్పటికే దక్షిణ కొరియా స్పష్టం చేసింది. అయినప్పటికీ యూఎస్ భద్రతా దళాలు మాత్రం సియోల్ ఉత్తర భాగంలో భారీగా మోహరింపులు చేస్తోంది. మరోవైపు ఉంటే ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతం ఖసన్లో ఇప్పటికే రష్యా తన సైన్యాన్ని దించటంతో మున్ముందు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
సంచలన వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా మరోసారి వివాదానికి తెరలేపింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను భస్మం చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందటే ఏక కాలంలో వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని ప్రధాన భవంతులన్నింటిని నామరూపాల్లేకుండా నేలమట్టం చేశాయి. జనవరి 6న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వాటిన్నంటిని భేఖాతరు చేస్తూ తాజాగా రెచ్చగొట్టేలాగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలో ఏం ఉందటే.. ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా.. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు. అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి. అంతేకాదు, ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ వాక్యాలను కూడా చేర్చారు.