
సాక్షి, అమరావతి : పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్ స్టేట్‌గా నిలుస్తుందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యర్థి అన్నారు. మంగళవారం అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కైలాశ్ సత్యర్థి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం కైలాశ్ సత్యర్థి మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం చాలా బాగా జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న పలు కార్యక్రమాల గురించి చర్చకు వచ్చాయని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగుందని కైలాశ్ సత్యర్థి కితాబిచ్చారు. పేద మహిళలకు చేయూతనిచ్చే అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ సంస్థ తరఫున అన్నిరకాల సహాయ, సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చైల్డ్ ఫ్రంట్ స్టేట్ అన్న ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశమున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ఆనందగా ఉంటారని భావిస్తున్నాట్టు చెప్పారు. కైలాశ్ సత్యర్థితోపాటు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment