లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’ | kailash satyarthi declare war agenest child sexual abuse | Sakshi
Sakshi News home page

లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’

Published Wed, Aug 30 2017 1:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’ - Sakshi

లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’

చిన్నారులకు దన్నుగా మహోద్యమం: కైలాశ్‌ సత్యార్థి
‘శ్రేయస్కర బాల్యంతోనే శ్రేయస్కర భారత్‌ సాధ్యం
సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 16 వరకు ‘భారత్‌ యాత్ర’
కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 11 వేల కిలోమీటర్ల పర్యటన
అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నట్లు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమ నేత కైలాశ్‌ సత్యార్థి వెల్లడించారు. దేశంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు మహోద్యమానికి శ్రీకారం చుడుతు న్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 16 వరకు ‘భారత్‌ యాత్ర’ చేపడుతున్నట్లు వివరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో చిన్నారుల బాల్యానికి రక్షణ లేకపోవడం దురదృష్టకర మన్నారు. చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి గతేడాది దేశవ్యాప్తంగా 15 వేల కేసులు నమోదు కాగా, అందులో 4% కేసుల్లోనే దోషులకు శిక్ష పడిందని, 6% కేసులను కొట్టేశారని, మిగిలిన 90% కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం గత పదేళ్లలో చిన్నారులపై అకృత్యాలు 5 రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రేయస్కర బాల్యం’ద్వారానే ‘శ్రేయస్కర భారత్‌’నిర్మాణం సాధ్యపడుతుందన్నారు.

కనీస సదుపాయాలు కరువు..
దేశంలో అత్యాచారాలు జరిగిన చిన్నారులకు  భౌతికంగా, మానసికంగా భరోసా ఇచ్చేందుకు కనీసం పూర్తి స్థాయిలో వైద్యసదు పాయాలు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. భయం నుంచి స్వేచ్ఛ కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్ని వర్గాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చిన్నారుల పక్షాన గొంతెత్తేందుకు సమాజం ముందుకు రావాలని, నిశబ్దపు తెరల నుంచి శబ్దం చేసేందుకు చేపట్టిన మహోద్య మాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నో కలలు, అవకాశాలకు ప్రతిబిం బమైన హైదరాబాద్‌ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని, తెలంగాణ అతిపెద్ద భాగ స్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 21న జరిగే భారత్‌ యాత్రలో పాల్గొనాలని ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

ఇదీ యాత్ర స్వరూపం
భారత్‌యాత్ర సెప్టెంబర్‌ 11న కన్యా కుమారిలో ప్రారంభమై అక్టోబర్‌ 16న ముగుస్తుంది. యాత్రకు అనుబంధంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జమ్మూ కశ్మీర్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా యాత్రలు ప్రారంభమై ప్రధాన యాత్రలో కలుస్తాయి. ఈ యాత్రకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్ర పతిలతో పాటు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు లభించింది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 11వేల కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాల యాల విద్యార్థులతో మమేకమై వారిలో చైతన్యం నింపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement