న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి యుద్ధం రాక ముందే భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతూ 59 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఇరు దేశాల ప్రధాన మంత్రులను కోరారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయుడు కైలాశ్ సత్యార్థి స్థాపించిన ‘లారెట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్’ అనే సంస్థ ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు శనివారం లేఖలను అందించింది. ఆ లేఖలపై మలాలా యూసఫ్‌జాయ్, మహ్మద్ యూనస్, లీమాహ్ జిబోవీ, షిరిన్ ఎబడి, తవక్కోల్ కర్మాన్ తదితర నోబెల్ గ్రహీతలు సంతకాలు చేశారు. (మానసికంగా వేధించారు)
‘మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలివైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి. యుద్ధం రాకుండా ఉండేందుకు ఈ కీలక సమయంలో సంయమనం పాటించాలి. నాగరిక ప్రపంచంలో హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాలకు తావు లేదు. ఈ అంటువ్యాధులను గట్టి చర్యల ద్వారా వేళ్లతోసహా పెకలించాలి’ అని ఆ లేఖల్లో నోబెల్ గ్రహీతలు పేర్కొన్నారు. (‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది)
Comments
Please login to add a commentAdd a comment