Nobel laureates
-
Nobel Prize 2024: జన్యు నియంత్రణ గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోం: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. 2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచి్చందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్, రువ్కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు. -
భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి యుద్ధం రాక ముందే భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతూ 59 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఇరు దేశాల ప్రధాన మంత్రులను కోరారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయుడు కైలాశ్ సత్యార్థి స్థాపించిన ‘లారెట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్’ అనే సంస్థ ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు శనివారం లేఖలను అందించింది. ఆ లేఖలపై మలాలా యూసఫ్‌జాయ్, మహ్మద్ యూనస్, లీమాహ్ జిబోవీ, షిరిన్ ఎబడి, తవక్కోల్ కర్మాన్ తదితర నోబెల్ గ్రహీతలు సంతకాలు చేశారు. (మానసికంగా వేధించారు) ‘మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలివైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి. యుద్ధం రాకుండా ఉండేందుకు ఈ కీలక సమయంలో సంయమనం పాటించాలి. నాగరిక ప్రపంచంలో హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాలకు తావు లేదు. ఈ అంటువ్యాధులను గట్టి చర్యల ద్వారా వేళ్లతోసహా పెకలించాలి’ అని ఆ లేఖల్లో నోబెల్ గ్రహీతలు పేర్కొన్నారు. (‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది) -
నేటి నుంచే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్దదైన సైన్స్ పండగ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ)కు రంగం సిద్ధమైంది. పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుక ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వేదిక కానుంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఐఎస్సీలో పాల్గొంటారని, ఇందులో పలుదేశాల నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూవిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం పెంపునకు.. ఏటా జనవరి 3వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే. గత ఏడాది ఐఎస్సీ వేడుకలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా చివరి నిముషంలో రద్దయింది. దీంతో రెండు నెలల తరువాత మణిపూర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జలంధర్‌లో జరగనున్న 106వ సైన్స్ కాంగ్రెస్‌లో పలు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారని సదస్సు జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిద్ధం చేసిన సౌరశక్తి బస్సులో ప్రధాని మోదీ సమావేశ కేంద్రానికి విచ్చేస్తారని ఎల్పీయూ ఉపకులపతి అశోక్ మిట్టల్ తెలిపారు. ఐఎస్సీలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలల్లో సీఎస్ఐఆర్, డీఆర్డీవో, డీఏఈ, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రదర్శన ఉంటుందని, ఇందులో ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నది దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేదని ఆయన వివరించారు. యువ ప్రతిభకు వేదిక.. ఐఎస్సీ – 2019 రెండోరోజున జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపిక చేసిన దాదాపు 150 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. పది నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులు రూపొందించిన ఈ ప్రాజెక్టులు దేశంలో సైన్స్ ప్రాచుర్యానికి తోడ్పడతాయని అంచనా. మూడోరోజున సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ జరగనుంది. అదేరోజున విమెన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు మొత్తం 14 ప్లీనరీ సెషన్స్ ఐఎస్సీలో భాగంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నోబెల్ గ్రహీతలతో ప్రధాని ‘ఛాయ్ పే చర్చ’ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ గ్రహీతలైన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఛాయ్ పే చర్చా పేరిట ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారు. ప్రొఫెసర్ థామస్ సి.సుడాఫ్ (2013 వైద్య శాస్త్ర నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ అవ్రామ్ హెర్ష్కో (2004 కెమిస్ట్రీ నోబెల్ గ్రహీత), ప్రొఫెసర్ ఎఫ్.డంకన్ ఎం.హల్డానే (2016 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత) ఈ చర్చలో పాల్గొంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి ప్రధాని సలహాలు, సూచనలు తీసుకుంటారని సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. -
ఇస్కా.. చూడిక
రేపటి నుంచి తిరుపతిలో సైన్స్‌కాంగ్రెస్ సదస్సు హాజరుకానున్న ప్రధానమంత్రి సదస్సులో పాల్గొననున్న ఆరుగురు నోబెల్ గ్రహీతలు ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మరో 24 గంటల్లో మొదలుకాబోతుంది. గత రెండు నెలలుగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.175కోట్ల ఖర్చుతో తిరుపతి నగరాన్ని అందంగా ముస్తాబుచేశారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును 3వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్వీయూ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు. యూనివర్సిటీక్యాపంస్: ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌కు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరవుతారు. ఈ సందర్భంగా దాదాపు 10 మందికి ప్రధాని వివిధ రకాల అవార్డులను అందజేస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలు తమ సందేశాలను ఇవ్వనున్నారు. 4 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 5 వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బ్లూ ఎకానమీ, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, నెట్ జనరేషన్ నెట్వర్క్, క్లైమేట్ చేంజ్, లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాంట్రియర్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, స్పేస్ టెక్నాలజీ, 5జీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆఫ్సోర్ విండ్ ఫామ్స్, నానో టెక్నాలజీ, తదితర అంశాలపై 32 ప్లీనరీ ల్లో నిర్వహిస్తారు. వీటిల్లో ఎంఎస్ స్వామినాథన్, సతీష్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, తదితర ప్రముఖులు తమ సందేశాలను, అభిప్రాయాలను అందిస్తారు. మధ్యాహ్నం నుంచి 34 వేదికల్లో టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. వీటిల్లో పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పిస్తారు. 4 నుంచి చిల్డ్రన్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4 తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో చిల్డ్రన్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు చిదంబరం, రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ఉదయం పూట ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిపుణులు ఉపన్యా సం ఇస్తారు. మధ్యాహ్నం నుంచి బాలలను ఉత్తేజపరిచే సైన్స్ సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. 1,200 మంది పిల్లలు హాజరుకానున్నారు. 4న ఉమెన్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4వ తేదీన శ్రీనివాస ఆడిటోరియంలో ఉమెన్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 10మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రసంగించి మహిళలను ఉత్తేజపరుస్తారు. 12 వేల మందికి ఏర్పాట్లు ప్రధాని ప్రారంభించే సమావేశంలో 12వేల మంది కూర్చునేవిధంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులకు వేర్వేరుగా సీట్లు కేటాయించారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు 10 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్ వద్ద వంటచేసి అన్ని ఫుడ్ కోర్టులకు పంపిణీ చేస్తారు.