Tension conditions
-
సీఎం నివాసంపై పెట్రో బాంబు దాడి
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్ఎన్ఎల్సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్‌కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా.. రెండవది పెరడు వెనుకకు విసిరివేశారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటలనకు బాధ్యత వహిస్తూ.. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు. ఘర్షణలకు కారణం ఏంటంటే.. 2018 లో లొంగిపోయిన చెస్టర్‌ఫీల్డ్ థాంగ్‌కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. అయితే థాంగ్‌కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్‌కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు. ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది. -
మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత
మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కొన్ని రోజులుగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మైహోమ్ సంస్థకు ‘మీరంటే - మీరు అమ్ముడుపోయారు’ అంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెర తీశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రమాణానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు బుధవారం ఆలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వేపలమాధారం, మేళ్లచెరువు గ్రామాల పరిధిలోని 631 ఎకరాల్లో మైనింగ్ విస్తరణను మై హోం సంస్థ చేపట్టాలని భావించింది. దీనిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. దీనిపై దాదాపు 15 రోజులుగా వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మైనింగ్ విస్తరణతో కాలుష్యం పెరుగుతుందని, పొలాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మై హోం సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేడే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కానుంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న డేరాబాబా నానక్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో యాత్రికులకు ఆధునిక వసతులు కల్పించారు. పూర్తి ఎయిర్ కండిషన్‌తో కూడిన ఈ భవనంలో రోజుకు 5వేల మంది యాత్రికులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు వీలుగా 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గురునానక్ తన చివరి 14 ఏళ్లు గడిపిన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలిపే 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా ప్రతి రోజు 5వేల మంది భారత్ యాత్రికులు సందర్శించేందుకు వీలుంటుంది. మొదటి బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు పంజాబ్‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కాగా, కర్తార్‌పూర్ వెళ్లే సీనియర్ల సిటిజన్లకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. డేరాబాబా నానక్, సుల్తాన్పూర్ లోథి గురుద్వారాల వద్ద గురునానక్ జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పూలతోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేస్తాం: పాక్ కారిడార్ ప్రారంభం కానున్న ఈనెల 9వ తేదీ, గురు నానక్ జయంతి రోజైన 12వ తేదీన తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఒక్కో యాత్రికుడి నుంచి సుమారు రూ.1,400 (20 డాలర్లు) వసూలు చేయనున్నట్లు పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం సాయంత్రం తెలిపింది. -
‘మధ్యవర్తిత్వం చేయడానికి నేను సిద్ధమే’
వాషింగ్టన్: గతంతో పోలిస్తే గడిచిన రెండు వారాలుగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ మరో సారి పేర్కొన్నాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశంలో భారత్-పాక్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో భారత ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కశ్మీర్ విభజన అనంతరం నేను ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడాను. సంయమనం పాటిస్తూ.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను. గత రెండు వారాల నుంచి ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. భారత్-పాక్ కోరుకుంటే కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక దీని గురించి వారే ఆలోచించుకోవాలి’ అని తెలిపారు. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీతో సందర్భంగా ట్రంప్ ఇరు దేశాల ప్రధానుల అంగీకరిస్తే.. కశ్మీర్ అంశంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ట్రంప్ వ్యాఖ్యలు మన దేశంలో తీవ్ర దుమారం రేపాయి. భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ మా దేశ అంతర్గత వ్యవహారమని.. మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఈ పరిణామాల అనంతరం కశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. -
భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి యుద్ధం రాక ముందే భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతూ 59 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఇరు దేశాల ప్రధాన మంత్రులను కోరారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయుడు కైలాశ్ సత్యార్థి స్థాపించిన ‘లారెట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్’ అనే సంస్థ ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు శనివారం లేఖలను అందించింది. ఆ లేఖలపై మలాలా యూసఫ్‌జాయ్, మహ్మద్ యూనస్, లీమాహ్ జిబోవీ, షిరిన్ ఎబడి, తవక్కోల్ కర్మాన్ తదితర నోబెల్ గ్రహీతలు సంతకాలు చేశారు. (మానసికంగా వేధించారు) ‘మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలివైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి. యుద్ధం రాకుండా ఉండేందుకు ఈ కీలక సమయంలో సంయమనం పాటించాలి. నాగరిక ప్రపంచంలో హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాలకు తావు లేదు. ఈ అంటువ్యాధులను గట్టి చర్యల ద్వారా వేళ్లతోసహా పెకలించాలి’ అని ఆ లేఖల్లో నోబెల్ గ్రహీతలు పేర్కొన్నారు. (‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది) -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు నష్ట పరిహారం చెల్లించాలని పెట్రోల్ బాటిల్ వెంట బెట్టుకుని ఇబ్రహీంపట్నం-మైలవరం రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు ధర్నాకు దిగారు. తమ ఇళ్లు కూలదోసి నష్ట పరిహారం ఇవ్వకుండా మూడు సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఓ బాధితుడు పెట్రోల్ పోసి తగల బెట్టుకోబోయాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మిగతా వారి దగ్గర పెట్రోల్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సీఎం ఇంటి దగ్గర నుంచి కదలబోమని బాధితులు భీష్మించుకు కూర్చున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే సమయం ఇవ్వడం లేడని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని ఆరోపించారు. నమ్మించి తమకు వెన్నుపోటు పొడిచారని వాపోయారు.10 రోజుల్లో నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాల నుంచి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసులు ధర్నా చేస్తున్న విషయం తెలిసి మంత్రి దేవినేని ఉమ వారికి ఫోన్ చేశారు. బాధితులకు తాను సహాయం చేస్తానని వారికి చెప్పారు. తమ మాటలు నమ్మే ఇంతవరకు మోసపోయామని, ఇక మీ మాట నమ్మమన్న భాదితులు చెప్పడంతో ఆయన కంగుతిన్నారు. మీ ఇంటికి న్యాయం చేయమని వస్తే అరెస్ట్ చేయిస్తామన్న మీరు ఇప్పుడు న్యాయం చేస్తామంటే ఎలా నమ్మాలని భాదితులు ప్రశ్నించారు. -
అస్సాంలో ఉద్రిక్తత
అపహరణకు గురైన నలుగురి మృతదేహాలు స్వాధీనం గువాహటి: అస్సాంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బోడో తీవ్రవాదులు అపహరించిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలను బక్సా జిల్లాలోని బేకీ నది నుంచి ఆదివారం పోలీసులు వెలికితీశారు. మరోమైపు కిడ్నాప్‌నకు నిరసనగా సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) మిలిటెంట్లు శుక్రవారం బార్పేట జిల్లాకు చెందిన అతావూర్ రహమాన్(27), రూబుల్ అమీన్ (45), సద్దాం అలీ(13), బకర్ అలీ (13)లను అపహరించారు. వీరిలో బకర్ అలీ మృతదేహాన్ని శనివారమే బేకీ నది నుంచి స్వాధీనం చేసుకోగా.. మిగిలిన ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మరోవైపు వీరి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు.. తమపై వేధింపులకు సంబంధించి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం శనివారం ఉదయం నుంచి సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి.. భారీగా బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్త చర్యగా సైన్యాన్ని కూడా రప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది మేలో బక్సా, కోక్రాఝర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో బోడో తీవ్రవాదుల చేతుల్లో 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.