ఎవరీ కైలాశ్ సత్యార్థి?
భారతీయుడు కైలాశ్ సత్యార్థికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించడంతో ఆయన పేరు మీడియాలో మార్మోగుతోంది. బాలల హక్కుల కార్యకర్త అయిన ఇప్పటివరకు 80 వేల మంది పిల్లలకు వెట్టిచారికి నుంచి విముక్తి లభించారు. బచ్పన్ బాచావో ఆందోళన్ సంస్థను స్థాపించి అనాథ బాలలకు పునరావాసం, విద్య అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన ఆయన బాలల హక్కుల కోసం అవిరాళ పోరాటం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కైలాశ్ సత్యార్థి న్యూఢిల్లీలో నివసిస్తూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.