'ఐపాడ్లు కాదు పుస్తకం అడుగుతున్నారు'
న్యూఢిల్లీ: పిల్లలు ఐపాడ్లు కోరుకోవడం లేదని, పుస్తకం అడుగుతున్నారని పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్‌జాయ్ మలాలా అన్నారు. కైలాష్ సత్యార్థి, మాలాలా నార్వేలోని ఓస్లోలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలసి మాలాలా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే. తాము పెన్ను, పుస్తకం అడుగుతున్నామని మలాలా అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాని చెప్పారు. కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ.. మలాలా పోరాట స్ఫూర్థి అందరికీ గర్వకారణమని ప్రశంసించారు. బాలల హక్కుల కోసం పోరాటంలో యువతను చైతన్య పరచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ బుధవారం నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.