‘నోబెల్’ సందేశం గ్రహించారా? | 'Noble' to comprehend the message? | Sakshi
Sakshi News home page

‘నోబెల్’ సందేశం గ్రహించారా?

Published Sun, Oct 12 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

‘నోబెల్’ సందేశం గ్రహించారా?

‘నోబెల్’ సందేశం గ్రహించారా?

తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్‌కు తగ్గట్టుగానే  ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది.  పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్‌పేయిని పరీక్షించి చూసినట్టుగా మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు.
 
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఢిల్లీకి చెందిన గాంధేయవాది కైలాష్ సత్యార్థిని, ప్రవాసంలో గడుపుతున్న అసాధారణ పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌లను ఎంపిక చేశారు. వారి ఎంపిక ద్వారా నార్వే నోబెల్ కమిటీ... ప్రపంచం మెచ్చేది సంక్షేమ మంత్రాన్నే గానీ యుద్ధ తంత్రాన్ని కాదనే శక్తివంతమైన సందేశాన్ని పంపింది. పాకిస్థాన్ యుద్ధ సైనిక వ్యవస్థలో ఉన్నవారెవరైనాగానీ కాస్త చెవులకు పట్టిన తుప్పును వదలించుకుని ఆ సందేశాన్ని వినడం మొదలెట్టాలి. అదేదో నిరాకారమైన మానవాళి ఉద్ధరణ కోసమనో లేక  సంఘర్షణలో చిక్కుపడి ఉన్న ఉపఖండం మంచి కోసమనో గాక పాకిస్థాన్ బాగు కోసమేనని భావించి మరీ వినాలి.

ఇంతవరకు ఇద్దరు పాకిస్థానీలకు నోబెల్ బహుమతి లభించింది. 1979లో భౌతిక శాస్త్రవేత్త అబ్దుస్ సలామ్‌కు, ఇప్పుడు మలాలాకు. సలామ్ దైవ భక్తి గలిగిన ధర్మ నిష్టాపరుడే. అయినాగానీ ఆయన హత్యకు గురవుతానే మోనన్న భయంతో పాక్‌లో అడుగు పెట్టలేరు. కారణం ఆయన ఖాదీయానీ (అహ్మదీ ముస్లిం) శాఖకు, మత భ్రష్టమైనదిగా ముద్రవేసిన శాఖకు చెందినవాడు. ఉగ్రవాదాన్ని దుందుడుకు తిరోగమనవాద సామాజిక అజెండాతో కలగలిపిన ఆటవిక ఉగ్రవాదులకు బాలికల విద్యలో విశ్వాసంలేదు. కాబట్టి మలాలా వారికి లక్ష్యంగా మారింది. భారత్, అఫ్ఘానిస్థాన్‌లకు వ్యతిరేకంగా సాగు తున్న ముసుగు యుద్ధంలో అగ్రశ్రేణిలో నిలవడానికి ఆత్మాహత్యా సదృశమైన ఉత్సాహాన్ని ప్రదర్శించే పాక్  ‘రాజ్యంలోని రాజ్యం’ ఆ ఉగ్రవాద ముఠాలకు రక్షణను కల్పిస్తోంది.

 తొమ్మిది రోజులుగా వైషమ్యంతో గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహ మైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్య వాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్‌కు తగినట్టుగానే  ఇంత కింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి.

పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్‌పేయిని పరీక్షించి చూసినట్టుగా నరేంద్ర మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉందడు. ఒత్తిడికి లొంగి పోవడానికి  ఆయనేమీ బలహీనుైడైన నేత కారు. రాహుల్ గాంధీ తిరిగి తనకే బెడిసి కొట్టగుండా తుపాకీని పేల్చడం అతి అరుదు. పాక్ ఒత్తిడికి మోదీ, రక్షణ మంత్రి అరుణ్‌ై జెట్లీలు లొంగిపోతున్నారని ఆయన శాసన సభ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అలా అని ఆయన కాంగ్రెస్ ఓట్లు మరింత క్షీణించి పోయేలా చేశారు. క్విక్జోట్‌లాగా రాహుల్ ఇలా గాలి మరలపైకి తిరిగారో లేదో, 48 గంటలు గడిచేలోగానే పాక్ వెనక్కు తగ్గింది.

పాక్ దౌత్య, సైనిక అధికారులు టీవీల్లో లేదా సమా వేశాల్లో కనిపించినప్పుడల్లా ఇదంతా ముందుగా  ప్రారంభించినది భారత దేశమేనంటూ ఒకే ఒక్క సుపరిచితమైన ఆధారాన్ని చూపుతుంటారు. ఇతర రంగాల్లో, ప్రత్యేకించి దేశంలోపలే పలు అంతర్గత యుద్ధాల్లో పాక్ సైన్యం పెద్ద ఎత్తున మునిగి ఉండగా  భారత్‌తో ఘర్షణకు దిగడానికి తగు కారణమేదీ లేదని వివరణ ఇస్తుంది. ఇదో కుత్సితం. హేతుబద్ధత మాటున పాక్ హేతువిరుద్ధమైనదాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది.  

భారత్‌పై యుద్ధానికి దిగడానికి హేతుబద్ధమైన కార ణం ఏదైనాగానీ ఉండాల్సిన అవసరం ఉన్నదని పాక్‌కు ఎప్పుడూ అనిపించలేదు. శాంతియుతంగా చర్చలతో సాధించుకోగల దాన్ని యుద్ధంతో చేజిక్కిం చుకోవాలనే దే స్వాతంత్య్రం తర్వాత అది తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం. అటు పాక్‌లోగానీ, ఇటు భారత్‌లో గానీ విలీనం కాకుండా ఉన్న కాశ్మీర్ కోసం అది అక్టోబర్ 1947లోనే తిరుగు బాటు దార్లను, ఉగ్రవాదులను ప్రయోగించి దురాక్రమణను ప్రారం భించింది.

ఏ మాత్రం సాధారణ ఇంగితం మార్గ దర్శకత్వంలోనైనా పాక్ విధానం సాగి ఉంటే 1948 వసంతం లేదా వేసవి నాటికే (అప్పటికి మనకు లభిం చినది అధినివేశ ప్రతిపత్తి మాత్రమే) బ్రిటిష్‌వారి అజమాయిిషీ కిందనే కాశ్మీర్ సమస్య శాంతి యుతంగా పరిష్కారమై ఉండేది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదం, ముసుగు యుద్ధం, సాధారణ సంఘర్షణలను కలగలిపి 1965లో భారత్‌పై యుద్ధానికి దిగింది. సాధారణ యుద్ధం ద్వారా  కాశ్మీర్‌ను జయించడం ఎన్నటికీ సాధ్యంకాదని అది 1965, 1971 యుద్ధాల తదుపరి గ్రహించింది. దీంతో అది ఉగ్రవాదం, మంద్ర స్థాయి రెచ్చగొట్టే చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల ఎత్తుగడలను కలగలిపి కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచగలిగే ఏకైక ఆధరువుగా మార్చింది.

తద్విరుద్ధంగా, 1949 జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ప్పటి నుండి భారత్ ఎన్నడూ కాశ్మీర్‌లో తన భూభాగాన్ని విస్తరింపజేసుకోవాలని కోరుకోలేదు. 1971 యుద్ధంలో ఢాకాలో దాని 90 వేల బలగాలు మనకు లొంగిపోయిన దుస్థితిలో పాక్ ఉన్నప్పుడు కూడా మన దేశం ఆ ప్రయత్నం చేయలేదు. అలా అని దాడికి గురైనప్పుడు భారత్ బల గాలు చేతులు ముడుచుకు కూచుంటాయని కాదు. దశాబ్దిగా ఎన్నడూ ఎరుగని స్థాయి లలో పాక్ గత వారంలో హింసను రేకెత్తించగా మన బలగాలు మోదీ  నాయకత్వంలో  గట్టిగా  బదులు చెప్పాయి.

అసలు ఇప్పడు ఎందుకీ సరిహద్దు కాల్పులు? అనే ప్రశ్న మనకింకా మిగిలే ఉంటుంది. సమాధానంలోని కొంత భాగం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వాషింగ్టన్‌లో విడుదల చేసిన కీలకమైన సంయుక్త ప్రకటనలో ఉన్నదేమోనని ఆశ్చర్యం కలుగుతోంది.

అమెరికా మొట్టమొదటిసారిగా పాక్ అభ్యం తరాలను పక్కన పెట్టి పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా సాగే యుద్ధంలో భారత్ నిర్వహించాల్సిన సమంజసమైన పాత్ర ఉన్నదని అంగీకరించింది. తప్పుడు వ్యాఖ్యానాలకు గురికాకుం డటం కోసం నిర్దిష్టంగా ఆ ప్రకటన లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, అల్‌కాయిదా, హక్కానీ నెట్ వర్క్ (అఫ్ఘానిస్థాన్‌లో పనిచేసేది), దావూద్ ఇబ్రహీం ‘డి’ కంపెనీ, ఇరాక్ ఇస్లామిక్ రాజ్యం వంటి సంస్థల పేర్లను పేర్కొనలేదు.

ఇది భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాన్ని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంలోకి విస్తరింపజేసి, ఈ యుద్ధంలో భారత్‌ను అమెరికాకు ముఖ్య మిత్రునిగా మారుస్తుంది. అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌తో వ్యవహరించేట్పపుడు అమెరికా రక్షణ దుర్గంగానూ, జిహాదిస్టులతో వ్యవహరించేటప్పుడు ఉగ్రవాద స్థావరంగాగానూ పాక్ ద్విపాత్రాభి నయం చేస్తోంది. ఆ  ద్విపాత్రాభినయం ఇప్పడు పూర్తిగా బహిర్గతం కాకపోయినా మునుపెన్నడూ ఎరుగని విధంగా ఇబ్బందుల్లో పడింది.పాక్ సైన్యాధికారులు తమ సాయుధ శక్తిని తూర్పు రంగానికి మరలుస్తున్నామని భారత్, అమెరికా లకు సంకేతం పంపుతున్నారా?

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement