ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్‌: సత్యార్ధి | I thank Delhi police: Kailash Satyarthi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్‌: సత్యార్ధి

Published Sun, Feb 12 2017 1:44 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్‌: సత్యార్ధి - Sakshi

ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్‌: సత్యార్ధి

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన నోబెల్‌ శాంతి బహుమతి నమూనా, మిగతా విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసును ఛేదింనందుకు ఢిల్లీ పోలీసులకు సత్యార్థి ధన్యవాదాలు తెలిపారు. పోలీసు వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని చెప్పారు. తన తండ్రి పోలీసు కానిస్టేబుల్ అని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్‌, సత్యార్థికి సంయుక్తంగా 2014లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. తనకు వచ్చిన మెడల్ ను 2015, జనవరిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సత్యార్థి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement