'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని' | will have been more happy if Mahatma Gandhi was conferred the award first | Sakshi
Sakshi News home page

'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'

Published Fri, Oct 10 2014 9:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'

'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'

న్యూఢిల్లీ: తనకన్నా ముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ముందుగా గాంధీజీకి వచ్చే ఉంటే మరింత సంతోషించేవాడినని అన్నారు.
 
 ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ దేశానికి అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను'అని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement