విద్యార్ధులతో కరచాలనం చేస్తున్న కైలాస్ సత్యార్థి
జయనగర : దేశంలో చోటుచేసుకుంటున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నోబెల్ శాంతి పురస్కారగ్రహీత ౖకైలాస్‌సత్యార్థి సూచించారు. యలహంక శేషాద్రిపుర డిగ్రీ కాలేజీలో భారతీయవిజ్ఞానసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సిల్వర్‌జూబ్లీ టాక్‌లో కైలాస్‌సత్యార్థి పాల్గొని మాట్లాడారు. వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థినులపై జరిగే లైంగిక దాడులను బాధితులు బయటకు చెప్పుకోలేక పోతున్నారన్నారు. తల్లిదండ్రులు స్నేహభావంతో మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకోవాలన్నారు.
నేటికి కోట్లాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని, దుస్తులు, పాఠ్యపుస్తకాల కొనుగోలుకు డబ్బు లేక చదువులకు దూరమవుతున్నారన్నారు. ప్రపంచంలో 152 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారన్నారు. వారికి విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బోధన రంగంలో ఉన్నత పదవులు అలంకరించాలన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం కైలాస్ సత్యార్థిని ఘనంగా సన్మానించింది. డీఆర్‌డీఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వీకే.అత్రే, ఐఐఎస్సీ మాజీ డైరెక్టర్ ప్రొ.బలరామ్, సంస్థ గౌరవకార్యదరి డాక్టర్ వూడే పీ.కృష్ణ, డాక్టర్ ఎంపీ .రవీంద్ర, శేషాద్రిపురం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్‌ఆర్.పండితారాద్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment