అమెరికా నిఘా వ్యవహారాలను ప్రపంచానికి చాటిన ధీరుడు
ఓస్లో (నార్వే): దేశ భద్రత ముసుగులో దేశాలు, సంస్థలు, వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాలపై విస్తృత స్థాయిలో నిఘా పెట్టిన అమెరికా దుశ్చర్యను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. స్నోడెన్ సహకారంతో వికీలీక్స్ వెబ్‌సైట్ వెల్లడించిన అమెరికా నిఘా వ్యవహారం గత సంవత్సరం సంచలనం సృష్టించింది.
అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమయ్యాయి. నార్వేలో ఇంతకుముందు అధికారంలో ఉన్న వామపక్ష సోషలిస్ట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బార్డ్ వెగర్ సోజెల్, సొంత పార్టీకి చెందిన మరో నేత స్నోరీ వాలెన్‌తో కలిసి స్నోడెన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. స్నోడెన్ చర్య ప్రభుత్వాల విశ్వసనీయతపై చర్చను లేవనెత్తిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
‘నోబెల్’కు నామినేట్ అయిన స్నోడెన్
Published Thu, Jan 30 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement