బాలికల ఆలనా పాలనలో సాయి సేవా సంఘ్..
35వ వార్షికోత్సవం నేపథ్యంలో మంగ్లీ లైవ్ కాన్సర్ట్ : రూ.లక్ష విరాళం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్‌దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు.
35వ వార్షికోత్సవం నేపథ్యంలో..
నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది.
ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...
ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్‌టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment