hearts
-
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
గాభరా గుండెలకు స్మార్ట్ టచ్
ఈ కాలంలో స్ట్రెస్ లేనిదెవరికి చెప్పండి? వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికే కాదు.. దాదాపు అందరిలోనూ ఒత్తిడే ఒత్తిడి. దీన్ని తగ్గించుకునేందుకే గదా.. కొంతమంది యోగా, వ్యాయామం బాటపడుతున్నారు.. ఇంకొందరు సంగీతం, కళారూపాలను ఎంచుకునేది. ఇప్పుడు వీటి అవసరం అస్సలు లేదంటోంది యూకే కేంద్రంగా పనిచేస్తున్న బయోసెల్ఫ్ టెక్నాలజీ అనే సంస్థ. మరి స్ట్రెస్‌కు విరుగుడు ఎలా అంటే.. ఫొటోలో ఈ ఉన్న గాడ్జెట్‌ను వాడితే చాలంటుంది. ఛాతీకి కట్టేసుకునే ఈ పరికరం పేరు సెన్సేట్! దీంట్లోని రకరకాల సెన్సర్లు గుండెకొట్టుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగాలతోపాటు మనం కూర్చునే తీరు, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటాయి. ఈ సమాచారాన్ని వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తూంటాయి. ఈ అప్లికేషన్‌లోని సాఫ్ట్వేర్.. వచ్చిన సమాచారం మొత్తాన్ని విశ్లేషించి.. మనిషి ఒత్తిడికి గురవుతున్నాడా? లేదా? అన్నది నిర్ధారించుకుంటుంది. అందుకు తగ్గట్టుగా ఛాతీపై గాడ్జెట్ స్పందిస్తుంది. చెవికి వినిపించని స్థాయిలో కొన్ని ధ్వని తరంగాలను శరీరంలోకి పంపడం మొదలుపెడుతుంది. ఈ కంపనలు కాస్తా వాగస్ నాడిని ప్రేరేపించి మనసు కుదుటపడేలా చేస్తుందన్నది కంపెనీ అంటున్న మాట. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తనవంతుగా మనసుకు హాయి కలిగించే ప్రత్యేకమైన సంగీతాన్ని వినిపిస్తుందట. ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ సంగీతం కూడా స్ట్రెస్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ అంటోంది. ప్రస్తుతానికి సెన్సేట్ అన్నది నమూనాల దశలోనే ఉంది. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు బయో సెల్ఫ్ కంపెనీ నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒక్కో సెన్సేట్ను రూ.14 వేలకు విక్రయించాలన్నది కంపెనీ ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే.. సెన్సేట్ ఉదయం వేళల్లో మీకు ధ్యానం చేయించే గురువుగా.. ఒత్తిడి పెరినప్పుడు సంగీతం వినిపించే స్నేహితుడిగానూ ఉంటుందని అంటున్నారు కంపెనీ సీఈవో స్టెఫాన్ చిమ్లిక్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు వైఎస్ఆర్
-
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్‌లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్‌లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్‌కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్‌టేకర్‌గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు. -
ప్రేమ పండించుకోండి ఇలా.
. వాలెంటైన్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. కుల, మతాలకు అతీతమైన రోజు ఫిబ్రవరి 14. ప్రేమ వివాహాలు చేసుకుని, ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరి అనుభవాలు వారి మాటల్లోనే.. నేను అమెరికాలో బీఎస్ చదువుతున్నపుడు కళాశాల మెస్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడిని. అక్కడే పనిచేస్తూ చదువుతున్న సెల్వియాను చూశాను. ఆర్భాటాలకు పోకుండా కష్టపడి పనిచేసే తత్వం, ఎదుటి వారికి వీలైనంత సాయపడేతత్వం నాకు నచ్చడంతో ప్రేమించాను. పెళ్ళి విషయమై ఇంట్లో చెప్పగా మొదట కంగారుపడినా ఆలోచించి సరైన నిర్ణయమని నమ్మి పెళ్ళికి అంగీకరించారు’ అని చెప్పారు రాజీవ్ అవిర్నేని. ‘సాధారణంగా భారతీయులు సౌమ్యంగా ఉంటారు. రాజీవ్ తీరు నాకు నచ్చింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలంలే నాకు ఇష్టం. దాంతో ఇష్టపడి రాజీవ్‌ను పెళ్లాడారు. ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉంది. ప్రేమించడమంటే ఇష్టపడిన వారి అభిప్రాయాలకు విలువనిచ్చి, కష్టాల్లో, సుఖాల్లో ఎప్పుడూ కలిసి ఉండటమే దాని అర్థం’ అన్నారు సెల్వియా. -న్యూస్‌లైన్, ఆటోనగర్ ప్రేమతో ఏదైనా సాధించవచ్చు నా పేరు శ్రీనివాస్. నేను రిలయన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఆషాలతతో పరిచయం ఏర్పడింది. మొదట్లో నేనంటే కోపంగా ఉండేది. తరువాత నన్ను పూర్తిగా అర్థం చేసుకుని పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక పాప. గడచిన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. కష్ట, నష్టాల్లో జీవితం ముందుకు సాగింది. కోపంలో నుంచి పుట్టిన మా ప్రేమ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తుందని అనుకోలేదు. తోటివారికి ఉపయోగకరంగా నిలువాలనుకున్నాం. ఆ సంకల్పంతో ముందడుగు వేశాం. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని పీస్ఫుల్ యర్త్ ఫౌండేషన్ తెలిపింది. ఆ విధానం మాకు నచ్చింది. మేము చెప్పాల్సింది పీస్పుల్యర్త్ ఫౌండేషన్ ద్వారా చెబుతున్నాం. అన్నట్లు ఇవాళ మా పెళ్లి రోజు. -న్యూస్‌లైన్, కృష్ణలంక