
ప్రేమ పండించుకోండి ఇలా.
.
వాలెంటైన్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. కుల, మతాలకు అతీతమైన రోజు
ఫిబ్రవరి 14. ప్రేమ వివాహాలు చేసుకుని, ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరి అనుభవాలు వారి మాటల్లోనే..
నేను అమెరికాలో బీఎస్ చదువుతున్నపుడు కళాశాల మెస్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడిని. అక్కడే పనిచేస్తూ చదువుతున్న సెల్వియాను చూశాను. ఆర్భాటాలకు పోకుండా కష్టపడి పనిచేసే తత్వం, ఎదుటి వారికి వీలైనంత సాయపడేతత్వం నాకు నచ్చడంతో ప్రేమించాను.
పెళ్ళి విషయమై ఇంట్లో చెప్పగా మొదట కంగారుపడినా ఆలోచించి సరైన నిర్ణయమని నమ్మి పెళ్ళికి అంగీకరించారు’ అని చెప్పారు రాజీవ్ అవిర్నేని. ‘సాధారణంగా భారతీయులు సౌమ్యంగా ఉంటారు. రాజీవ్ తీరు నాకు నచ్చింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలంలే నాకు ఇష్టం. దాంతో ఇష్టపడి రాజీవ్‌ను పెళ్లాడారు. ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉంది. ప్రేమించడమంటే ఇష్టపడిన వారి అభిప్రాయాలకు విలువనిచ్చి, కష్టాల్లో, సుఖాల్లో ఎప్పుడూ కలిసి ఉండటమే దాని అర్థం’ అన్నారు సెల్వియా.
-న్యూస్‌లైన్, ఆటోనగర్
ప్రేమతో ఏదైనా సాధించవచ్చు
నా పేరు శ్రీనివాస్. నేను రిలయన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఆషాలతతో పరిచయం ఏర్పడింది. మొదట్లో నేనంటే కోపంగా ఉండేది. తరువాత నన్ను పూర్తిగా అర్థం చేసుకుని పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక పాప. గడచిన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. కష్ట, నష్టాల్లో జీవితం ముందుకు సాగింది. కోపంలో నుంచి పుట్టిన మా ప్రేమ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తుందని అనుకోలేదు. తోటివారికి ఉపయోగకరంగా నిలువాలనుకున్నాం. ఆ సంకల్పంతో ముందడుగు వేశాం. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని పీస్‌ఫుల్ యర్త్ ఫౌండేషన్ తెలిపింది. ఆ విధానం మాకు నచ్చింది. మేము చెప్పాల్సింది పీస్‌పుల్‌యర్త్ ఫౌండేషన్ ద్వారా చెబుతున్నాం. అన్నట్లు ఇవాళ మా పెళ్లి రోజు. -న్యూస్‌లైన్, కృష్ణలంక