Touching
-
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
మహిళలు, బాలికల పట్ల హోంగార్డు వెకిలి చేష్టలు..
-
స్పందనలు కలిగించే రోబోలు!
న్యూయార్క్: మనుషుల్లో స్పందనలను సృష్టించే రోబోలు రానున్నాయి. 'స్నేహంగా ఉండే , భయపెట్టని యంత్రాలు' గా రోబోలకు పేరుంది. మనుషుల పోలికలకు దగ్గరగా ఉండే సీ-3 పీవో, వాల్-ఇ అనే రోబోలు మానవుల్లో భావోద్వేగ స్పందనలను రేకెత్తించగలవని స్టాన్ ఫర్డ్ యూనివర్సలటీ పరిశోధనలో తేలింది. మనుషుల శరీరంలోని 13 భాగాలను తాకే ప్రోగ్రాంతో వీటిని తయారు చేశారు. ఈ రోబోలు మానవ శరీరంలోని మెడ, తల భాగాల కంటే మిగతా సున్నిత భాగాలను తాకి వారిలో ఎక్కువ స్పందనలను కల్గించాయని పరిశోధకులు పేర్కొన్నారు. జపాన్ లోని ఫుకుమాలో జూన్ లో జరుగనున్న ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ లో వీటిని ప్రదర్శించనున్నారు. శక్తివంతమైన రోబోను తమ పరిశోధన ఫలితంగా రూపొందించామని, ఇవి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని స్టాన్ ఫర్డ్ పరిశోధకుడు జామి లీ పేర్కొన్నారు. -
బాబు గారి భక్తులు కాల్ యముళ్లు