న్యూయార్క్: మనుషుల్లో స్పందనలను సృష్టించే రోబోలు రానున్నాయి. 'స్నేహంగా ఉండే , భయపెట్టని యంత్రాలు' గా రోబోలకు పేరుంది. మనుషుల పోలికలకు దగ్గరగా ఉండే సీ-3 పీవో, వాల్-ఇ అనే రోబోలు మానవుల్లో భావోద్వేగ స్పందనలను రేకెత్తించగలవని స్టాన్ ఫర్డ్ యూనివర్సలటీ పరిశోధనలో తేలింది. మనుషుల శరీరంలోని 13 భాగాలను తాకే ప్రోగ్రాంతో వీటిని తయారు చేశారు.
ఈ రోబోలు మానవ శరీరంలోని మెడ, తల భాగాల కంటే మిగతా సున్నిత భాగాలను తాకి వారిలో ఎక్కువ స్పందనలను కల్గించాయని పరిశోధకులు పేర్కొన్నారు. జపాన్ లోని ఫుకుమాలో జూన్ లో జరుగనున్న ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ లో వీటిని ప్రదర్శించనున్నారు. శక్తివంతమైన రోబోను తమ పరిశోధన ఫలితంగా రూపొందించామని, ఇవి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని స్టాన్ ఫర్డ్ పరిశోధకుడు జామి లీ పేర్కొన్నారు.