మహిళలు, బాలికల పట్ల హోంగార్డు వెకిలి చేష్టలు.. | Kochi Home Guard Caught on Camera Touching Minors Inappropriately | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలికల పట్ల హోంగార్డు వెకిలి చేష్టలు..

Published Fri, Sep 21 2018 8:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కొచ్చిలోని తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్‌ అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. 

ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్‌ డిపార్డ్‌మెంట్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెలిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు శివకుమార్‌పై ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement