
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో
1.7 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.