bad incident
-
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది
తిరువనంతపురం : కరోనా వైరస్ మాటేమో గాని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. తమ వాళ్లను వదిలి మరీ కరోనా సేవలకు అంకితమైన వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం తరచుగా చూస్తున్నాం. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్భందికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు చేసిన పనికి వారంతా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. (కరోనా భారత్: ఒకే రోజు రెండు రికార్డులు) వివరాలు.. తిరువనంతపురంలో కంటైన్మెంట్ జోన్లో 25 ఏళ్ల ఒక డాక్టర్ తన సిబ్బందితో కలసి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు సిబ్బందితో కూడిన ఆమె బృందం పీహెచ్సీ సెంటర్ నుంచి కారులో బయలుదేరారు. కారు కస్లర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి చేరుకోగానే కారులోని వైద్య సిబ్బంది తమతో పాటు తెచ్చుకున్న పీపీఈ కిట్లు ధరించి పరికరాలతో దిగేందుకు సిద్దమయ్యారు. ఇంతలో కారును 50 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆందోళన చేయడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది అని తెలసుకునేలోపే ఇంకా పెద్ద ఎత్తున జనం గూమిగూడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరుస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కారు అద్దాలను దించడంతో ఒక వ్యక్తి తన తలను లోపల పెట్టి గట్టిగా దగ్గుతూ .. ఒకవేళ మాకు కరోనా ఉంటే కచ్చితంగా మీకు కూడ వస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్‌తో పాటు మిగిలిన నలుగురిని కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఈ సంఘటనపై 25 ఏళ్ల యువ డాక్టర్ మీడియాతో పంచుకున్నారు. 'నా ఎంబీబీఎస్ సంవత్సరం కింద పూర్తయింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న నాకు కరోనా విధులు అప్పగించారు. నాతో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక టెక్నీషియన్‌ను జతచేసి టీంగా రూపొందించి తిరువనంతపురంలోని క్లసర్కు కేటాయించారు. రోజువారిలానే విధులు నిర్వహించడానికి శుక్రవారం కూడా కారులో బయలుదేరాము. పీపీఈ కిట్లు ధరించేలోపే మా కారును 50 మంది చుట్టుముట్టి ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కారు విండోను ఓపున్ చేయొద్దని చెప్పా. కాని అనుకోని పరిస్థితుల్లో కారు విండో ఓపెన్ చేయడంతో ఒక వ్యక్తి తన తలను లోపలికి పెట్టి గట్టిగా దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు కూడా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. కారులో నాతో పాటు వచ్చిన ఒక నర్సు కంటతడి పెట్టింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాం. ఇప్పుడు మేమంతా క్వారంటైన్లో ఉన్నాం. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ విధులకు హాజరవుతాం. చూద్దాం ఏం జరుగుతుందో ' అంటూ డాక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిని ఇలా అవమానపరచడం దారుణమని పేర్కొంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలతో పాటు జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా సంఘటనపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిపై ఇలా ప్రవర్తించడం దారుణమని, కరోనా నేథ్యంలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటివి జరగకూడదని కెకె. శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు సూచించామని ఆమె తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండడంతో అక్కడి ప్రజలు స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యవసరాల సరుకులు మినహా మరెక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విదించడంతో వారంతా ఇలా తమ అసహనం వ్యక్తం చేశారని మంత్రి శైలజ మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ధర్నాలో అపశృతి
-
దివ్యాంగులకు చంద్రబాబు వద్ద చేదు అనుభవం
తాడేపల్లి రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు శనివారం ఉదయం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఉదయం 11 గంటల వరకు కరకట్టపైనే మండుటెండలో వేచి ఉన్నారు. చివరకు సీఎంతో మాట్లాడేందుకు ముగ్గురు ప్రతినిధులకు అవకాశం ఇచ్చారు. వారు సమస్యలను పూర్తిగా విన్నవించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ దివ్యాంగులందరికీ సమానంగా రూ.3,000 పింఛను ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క దివ్యాంగుడు కూడా చట్టసభల్లో లేరని, రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.. అని వ్యాఖ్యానించారని ఒక దివ్యాంగుడు వాపోయాడు. ఈనెల 27 నుంచి జరగనున్న టీడీపీ మహానాడులో దివ్యాంగుల సమస్యలపై చర్చించాలని కోరినట్టు తెలిపారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలి జోజిబాబు, వనమా బాబూరావు, వి.దుర్గారావు, సర్వేశ్వరరావు, రమేష్, ఎస్.కె.జిలాని, కొమ్మూరి రాధాకృష్ణ, ఏసుగంటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
ఆత్మకూర్ : మండల పరిధిలోని బాలకిష్టాపూర్ తండాలో మంగళవారం రాత్రి 10:30గంటలకు వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుం ది. ఎస్ఐ సీహెచ్ రాజు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన మంగ్యానాయక్ (38) వినాయక నిమజ్జనంలో ఉన్న జనరేటర్ స్టార్ట్ కాకుండా మొరాయించింది. దాన్ని స్టార్ట్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు భార్య శివమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇల్లు దోచుకుని తగులబెట్టారు
కొవ్వూరుపాడు(గోపాలపురం) : మండలంలోని కొవ్వూరుపాడులో ఓ ఇంటిలో దొంగలు పడి రూ. 30 వేలు నగదు, ఇతర సామన్లు దోచుకుని ఆనక ఇంటిని తగులబెట్టిన ఘటన కొవ్వూరుపాడులో గురువారం రాత్రి జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన బుద్దాల రాంబాబు కుమార్తె వివాహం ఇటీవల కుదిరింది. తాడేపల్లిగూడెంలో జరిగిన వివాహానికి గురువారం రాంబాబు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. గురువారం రాత్రి దొంగలు రాంబాబు ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో దాచిన రూ రూ.30 వేలు దోచుకుపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. వారు తాటాకింటికి నిప్పుపెట్టారు. కుమార్తె వివాహం అనంతరం ఇంటికి చేరిన రాంబాబు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాంబాబు తెలిపారు. -
ఇల్లు దోచుకుని తగులబెట్టారు
కొవ్వూరుపాడు(గోపాలపురం) : మండలంలోని కొవ్వూరుపాడులో ఓ ఇంటిలో దొంగలు పడి రూ. 30 వేలు నగదు, ఇతర సామన్లు దోచుకుని ఆనక ఇంటిని తగులబెట్టిన ఘటన కొవ్వూరుపాడులో గురువారం రాత్రి జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన బుద్దాల రాంబాబు కుమార్తె వివాహం ఇటీవల కుదిరింది. తాడేపల్లిగూడెంలో జరిగిన వివాహానికి గురువారం రాంబాబు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. గురువారం రాత్రి దొంగలు రాంబాబు ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో దాచిన రూ రూ.30 వేలు దోచుకుపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. వారు తాటాకింటికి నిప్పుపెట్టారు. కుమార్తె వివాహం అనంతరం ఇంటికి చేరిన రాంబాబు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రాంబాబు తెలిపారు.