న్యూఢిల్లీ : గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత ఈ గేమ్ ఆడాలంటే తగు సూచనల్ని పాటించాలని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రతినిధులు చెబుతున్నారు.
18లోపు పిల్లలు బీజీఎంఐ గేమ్ గా విడుదలవుతున్న పబ్జీగేమ్ ఆడాలంటే తప్పని సరిగా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రాఫ్టన్ తెలిపిన వివరాల ప్రకారం.. 18ఏళ్ల లోపు పిల్లలు ఈ గేమ్ ను మూడు గంటలకు మించి ఆడలేరు. ఎందుకంటే పిల్లల్లో ఈ గేమింగ్ వ్యసనాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మూడు గంటల దాటినా..ఈ గేమ్ ఆడాలంటే తప్పని సరిగ్గా తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి.
18ఏళ్ల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుమతితో గేమ్ కు బానిసవుతున్నాడని అనిపిస్తే.. తల్లిదండ్రులే ఆ గేమ్ ను బ్లాక్ చేసేలా గేమ్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపొచ్చు. వ్యక్తిగత బద్రత దృష్ట్యా మొబైల్ గేమర్ ల డేటాను ఇండియాతో పాటు సింగ్ పూర్ కు చెందిన సర్వర్ లో భద్రపరుస్తున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది.
చదవండి : BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?!
Comments
Please login to add a commentAdd a comment