Game Development Company
-
గేమింగ్ వరల్డ్‌కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్‌కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్‌లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్‌లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్‌ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్‌ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్‌ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్‌లో ఆ ముగ్గురు -
హైదరాబాద్‌లో మొబైల్ ప్రీమియర్ లీగ్.. కుదిరిన ఒప్పందం
పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు అనేకం ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వరుసలో మొబైల్ ప్రీమియర్ లీగ్ అనే గేమింగ్ కంపెనీ కూడా చేరింది. మొబైల్ ప్రీమియర్ లీగ్ దేశంలోనే ఈ మొబైల్ ఈ స్పోర్ట్, మొబైల్ గేమింగ్ ఫ్లాట్‌ఫార్మ్‌గా మెబైల్ ప్రీమియర్ లీగ్‌కి గుర్తింపు ఉంది. ఈ కంపెనీకి చెందిన యాప్‌లో గేమ్స్ ఆడటం ద్వారా అనేక రివార్డులు, క్యాష్ ప్రైజులు గెలుచుకోవచ్చు. ప్రతీ రోజు వందల కొద్ది గేమ్స్, టోర్నమెంట్స్ అందుబాటులో ఉంటాయి. వేలాది మంది ఈ ఫ్లాట్‌ఫామ్ మీదకు వచ్చి ఈ స్పోర్ట్స్ , గేమ్స్ ఆడుతున్నారు. ఎంపీఎల్‌కి ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. యూఎస్ఏ, చైనీస్ గేమింగ్ కంపెనీలకు ధీటుగా ఎదుగుతోంది. డెవలప్మెంట్ సెంటర్ తాజాగా హైదరాబాద్ నగరంలో గేమింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మొబైల్ ప్రీమియర్ లీగ్ ముందుకు వచ్చింది. 500ల మంది ఉద్యోగులతో అతి త్వరలో ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో మొబైల్ ప్రీమియర్ లీగ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీఎల్ సీఈవో సాయి శ్రీనివాసులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. Hyderabad | Mobile Premier League, an online gaming platform signed an MoU with Telangana to set up a game development centre on the sidelines of IndiaJoy 2021, which began here on Tuesday It was signed in presence of State Minister of Information Technology, KT Rama Rao pic.twitter.com/6eS7iFpMtx — ANI (@ANI) November 16, 2021 టాస్క్‌తో కూడా తమ స్వంత సెంటర్ ద్వారా గేమ్స్‌ని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో మొబైల్ ప్రీమియర్ లీగ్ కలిసి పని చేస్తుంది. టాస్క్‌లో ఉన్న వారికి ఈ స్పోర్ట్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్ రంగాల్లో అవసరమైన శిక్షణ అందివ్వనుంది. -
ఆన్లైన్ ఆట.. ఉపాధికి బాట
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లవాడు మొదలు పెద్దల వరకు అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు, గ్యాడ్జిట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో మరింత వేగంగా దూసుకువస్తున్న రంగం ఆన్లైన్ గేమ్స్. కోట్లాది రూపాయల టర్నోవర్లతో వీడియో గేమ్స్ నడుస్తున్నాయంటే ఈ రంగం ప్రాధాన్యత అర్థమవుతోంది. ఇందులో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదనేది నిపుణుల మాట. అంతటి ప్రాధాన్యత కలిగిన గేమ్ టెక్నాలజీని కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ పేరుతో నూతనంగా కోర్సును ఏర్పాటు చేశారు. ఏఎఫ్‌యూ (వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం కల్పించేలా రూపుదిద్దుకున్న ఈ కోర్సు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న రంగంగా నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ అరుదైన కోర్సు కడపలో ఏర్పాటు చేయడం విశేషం. కేవలం పిల్లలను సెల్ఫోన్లకే పరిమితం చేసే గేమ్స్ కొన్ని ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగకరమైన అంశాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా చిన్నారులకు అందించే అవకాశం ఉంది. చిన్నారుల్లో ఏకాగ్రతను, మేధోశక్తిని పెంపొందించడంలో ఈ సాంకేతికత దోహదపడుతుంది. అయితే సృజనాత్మకంగా ఆలోచించగలిగే వారికి ఇందులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. కోర్సులో ఏమి నేర్పుతారంటే.. బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీలో విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తారు. జావా, యూనిటీ, బ్లెండర్, మాయ, ఫొటోషాప్, 3డీ మోడలింగ్, ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి వినూత్న అంశాలు ఈ కోర్సులో నేర్పుతారు. మల్టీ టాస్కింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్పెషలైజ్డ్ కోర్సుగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కోర్సు ప్రభుత్వ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులో ఉంది. ప్రవేశం ఎలా.. 10 ప్లస్ 2 (ఎంపీసీ) చదివిన విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం ఈ యేడాది నుంచి ప్రారంభించిన ఏపీ ఈఏపీసెట్–2021 ద్వారా ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు నాలుగు సంవత్సరాలు. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలు వర్తిస్తాయి. అవకాశాలు ఇలా.. గేమ్ టెక్నాలజీస్‌లో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సినిమా రంగం, మల్టీమీడియా, సాఫ్ట్వేర్, యానిమేషన్, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గేమింగ్ టెక్నాలజీపై పట్టు సాధించిన వారికి లక్షల్లో వేతనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవకాశాల వెల్లువ-– సి. శ్రీలక్ష్మి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప గేమింగ్ అన్నది కేవలం వినోదాత్మకంగానే కాకుండా ఇప్పటి ఆధునిక ప్రపంచంలో బ్యాంకింగ్ రంగంలో మార్కెటింగ్ కోసం, విద్యారంగంలో పిల్లల ఐక్యూను పెంపొందించేందుకు దోహదపడుతుంది. రాబోయే తరాలకు మొబైల్ గేమింగ్, ఐఫోన్ గేమింగ్, సోషల్ గేమింగ్ ఒక దిక్చూచిగా నిలవనుంది. రానున్న రోజుల్లో గేమ్ ఆర్ట్, గేమ్ టెస్టర్, గేమ్ డిజైనర్లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం - – టి. భారతి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 2.5 బిలియన్ గేమర్లతో నూతన టెక్నాలజీలతో గేమింగ్ పరిశ్రమ శక్తివంతంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన కోర్సు. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా తక్కువ కాలంలోనే ఆకర్షణీయమైన వేతనాలతో కెరీర్ ప్రారంభించవచ్చు. చదవండి : నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్ -
BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు
న్యూఢిల్లీ : గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత ఈ గేమ్ ఆడాలంటే తగు సూచనల్ని పాటించాలని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రతినిధులు చెబుతున్నారు. 18లోపు పిల్లలు బీజీఎంఐ గేమ్ గా విడుదలవుతున్న పబ్జీగేమ్ ఆడాలంటే తప్పని సరిగా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రాఫ్టన్ తెలిపిన వివరాల ప్రకారం.. 18ఏళ్ల లోపు పిల్లలు ఈ గేమ్ ను మూడు గంటలకు మించి ఆడలేరు. ఎందుకంటే పిల్లల్లో ఈ గేమింగ్ వ్యసనాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మూడు గంటల దాటినా..ఈ గేమ్ ఆడాలంటే తప్పని సరిగ్గా తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. 18ఏళ్ల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుమతితో గేమ్ కు బానిసవుతున్నాడని అనిపిస్తే.. తల్లిదండ్రులే ఆ గేమ్ ను బ్లాక్ చేసేలా గేమ్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపొచ్చు. వ్యక్తిగత బద్రత దృష్ట్యా మొబైల్ గేమర్ ల డేటాను ఇండియాతో పాటు సింగ్ పూర్ కు చెందిన సర్వర్ లో భద్రపరుస్తున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. చదవండి : BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?! -
అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను!
ఆరేళ్ల ప్రాయంలోనే కోడింగ్ నేర్చుకుని వండర్ కిడ్ అనిపించుకున్న సమైరా మెహతా... ఎనిమిదేళ్లు వచ్చేసరికే ఓ ప్రత్యేకమైన బోర్డ్ గేమ్ రూపొందించి ఔరా అనిపించింది. ప్రస్తుతం తనకున్న నైపుణ్యాన్ని ఇతర పిల్లలకు కూడా అందించేందుకు గూగుల్ ‘కీనోట్ స్పీకర్’గా మారి సిలికాన్ వ్యాలీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఇండో- అమెరికన్. ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ సమైరా! ఐఐటీ- ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాకేశ్ మెహతా (ప్రస్తుతం ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ హెడ్- కాలిఫోర్నియా) తన ఇద్దరు పిల్లలు సమైరా, ఆదిత్లకు బాల్యం నుంచే టెక్ పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోడింగ్‌పై పట్టు సాధించిన సమైరా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే... తోటి పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పించేందుకు వీలుగా ‘కోడర్‌బన్నీజ్’ బోర్డ్ గేమ్‌ను రూపొందించింది. తద్వారా 2016లో థింక్ ట్యాంక్ నిర్వహించిన ‘పిచ్ఫెస్ట్’లో రెండో బహుమతి గెలుపొంది 2500 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కోడర్‌బన్నీజ్’ పేరు మీదుగానే ఓ సంస్థను స్థాపించి తన బోర్డ్ గేమ్‌ను అమెజాన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో యంగ్ సీఈఓ సమైరా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్- ఏఐ) కోడింగ్‌పై దృష్టి సారించిన సమైరా.. ‘కోడర్మైండ్స్’ అనే కొత్త బోర్డ్ గేమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ గేమ్ ద్వారా రోబోట్స్ తయారుచేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాల(ఏఐ మోడల్ అభ్యాసం)ను సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ గేమ్ రూపకల్పనలో సమైరా తమ్ముడు ఆదిత్(6) కూడా తన వంతు సహాయం చేస్తుండటం విశేషం. రియల్ లైఫ్ పవర్పఫ్ గర్ల్ సమైరా ప్రతిభకు ఫిదా అయిన దిగ్గజ సంస్థ గూగుల్ ఆమెను సిలికాన్ వ్యాలీలో తమ కీనోట్ స్పీకర్‌గా నియమించుకుంది. పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పేందుకు ఆమె చేత వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ హెడ్‌క్వార్టర్స్ మౌంటేన్ వ్యూ(కాలిఫోర్నియా)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్ కల్చరల్ ఆఫీసర్ స్టాసీ సులీవన్ సమైరాను కలిశారు. ఆమె వాక్చాతుర్యం, నైపుణ్యానికి ముచ్చపడిన స్టాసీ.. ‘సమైరా ప్రతిభావంతురాలు. తొందర్లోనే గూగుల్‌లో పూర్తి స్థాయిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది’ అంటూ కొనియాడారు. ఇక కార్టూన్ నెట్వర్క్ మార్కెటింగ్ విభాగం తమ చానల్ రూపొందించిన ‘యంగ్ ఇన్స్స్పైరింగ్ గర్ల్స్’ అనే కార్యక్రమంలో సమైరాకు చోటు కల్పించి.. ‘ద రియల్ పవర్పఫ్ గర్ల్’గా సమైరాను అభివర్ణించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా సమైరా ప్రతిభను గుర్తించినట్టు బిజినెస్ ఇన్ సైడర్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం తెలిపాయి. అవును.. వాళ్లు చేయగలరు ‘ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉంటూనే తమ పిల్లలు కోడింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కోడర్‌బన్నీజ్ వంటి నాన్- డిజిటల్ బోర్డ్ గేమ్స్ ఎంతో ఉపయోగకరం. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు 1 బిలియన్ మంది పిల్లలకు నా సంస్థ ద్వారా కోడింగ్ నైపుణ్యాలు నేర్పించడం నా ఉద్దేశం. నాకు తెలిసీ వాళ్లంతా కోడింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వారే. కాకపోతే వారి కోసం కొంచెం సమయం కేటాయించడంతో పాటుగా కోడర్‌బన్నీజ్ వంటి ఈజీ గేమ్‌ల అవసరం ఉంది. అమెజాన్ ద్వారా ఏడాదిలో వెయ్యి బాక్సుల బోర్డ్ గేమ్స్ అమ్మాను. దాని ద్వారా 35 వేల డాలర్ల ఆదాయం పొందాను. నేను ఆరేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నాను. ప్రస్తుతం కీనోట్ స్పీకర్‌గా కోడింగ్ మెళకువలు నేర్పుతున్నాను. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లను కలవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కోడర్‌బన్నీజ్ ఐడియాను వారిరువురు మెచ్చుకున్నపుడు ఎంతో గర్వంగా అన్పించింది. ప్రస్తుతం మా వెబ్సైట్లో రోబోటిక్స్, గేమ్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటన్నింటిలో మా నాన్న ఎంతగానో ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే నా ఆశయం’ అంటూ పదేళ్ల సమైరా తన అనుభవాలను పంచుకుంది. అంతేకాదు తన కంపెనీ పేరిట విరాళాలు సేకరించి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది కూడా. ఆసక్తే తనను ప్రత్యేకంగా నిలిపింది ‘సమైరా ఇండియాస్ వండర్ కిడ్ అని నా స్నేహితులు అంటూ ఉంటారు. కానీ తను కూడా అందరిలాంటిదే. కాకపోతే కోడింగ్ పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. అయితే చిన్నతనంలోనే తను ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం నాకు ఆనందంగా ఉన్నప్పటికీ.. కీర్తి తాలూకూ ప్రభావం తన మీద పడకూడదు అనుకుంటాను. ఒత్తిడి లేకుండా పనిచేస్తేనే సమైరా మరిన్ని విజయాలు సాధిస్తుంది’ అని రాకేశ్ మెహతా కూతురి గురించి చెప్పుకొచ్చారు. - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
7సీస్ నుంచి 3డీ వీడియో యానిమేషన్ ఫిల్మ్ ‘లవ్స్టార్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీ ఆధారిత గేమ్ డెవలప్మెంట్ కంపెనీ 7సీస్ ఎంటర్టైన్మెంట్ తాజాగా యానిమేటెడ్ 3డీ వీడియో ఫిల్మ్ లవ్‌స్టార్‌ను రూపొందించింది. యూ ట్యూబ్, డిజిటల్ మీడియాలలో యానిమేషన్ క్యారెక్టర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వినోదాన్ని అందించే క్యారెక్టర్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది. దేఖో దేఖో అంటూ అయిదు భాషల్లో సాగిన పాటతో కూడిన వీడియో నిడివి 3 నిముషాల 30 సెకన్లు. రజనీకాంత్, అమితాబ్, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీయార్ వంటి 18 మంది సినీ హీరోల నృత్యరీతులు, అనుకరణ వీక్షకులకు ఆనందాన్ని పంచుతుందని కంపెనీ ఎండీ ఎల్.మారుతీ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ తరహాలో యానిమేషన్ సాంగ్ రావడం తొలిసారి అని పేర్కొన్నారు. డ్యూయట్ మాదిరిగా సాగిన ఈ వీడియోలో కొన్ని స్టెప్పుల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి దేఖో దేఖో పాటను పాడారు.