పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు అనేకం ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వరుసలో మొబైల్ ప్రీమియర్ లీగ్ అనే గేమింగ్ కంపెనీ కూడా చేరింది.
మొబైల్ ప్రీమియర్ లీగ్
దేశంలోనే ఈ మొబైల్ ఈ స్పోర్ట్, మొబైల్ గేమింగ్ ఫ్లాట్‌ఫార్మ్‌గా మెబైల్ ప్రీమియర్ లీగ్‌కి గుర్తింపు ఉంది. ఈ కంపెనీకి చెందిన యాప్‌లో గేమ్స్ ఆడటం ద్వారా అనేక రివార్డులు, క్యాష్ ప్రైజులు గెలుచుకోవచ్చు. ప్రతీ రోజు వందల కొద్ది గేమ్స్, టోర్నమెంట్స్ అందుబాటులో ఉంటాయి. వేలాది మంది ఈ ఫ్లాట్‌ఫామ్ మీదకు వచ్చి ఈ స్పోర్ట్స్ , గేమ్స్ ఆడుతున్నారు. ఎంపీఎల్‌కి ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. యూఎస్‌ఏ, చైనీస్ గేమింగ్ కంపెనీలకు ధీటుగా ఎదుగుతోంది.
డెవలప్‌మెంట్ సెంటర్
తాజాగా హైదరాబాద్ నగరంలో గేమింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మొబైల్ ప్రీమియర్ లీగ్ ముందుకు వచ్చింది. 500ల మంది ఉద్యోగులతో అతి త్వరలో ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో మొబైల్ ప్రీమియర్ లీగ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీఎల్ సీఈవో సాయి శ్రీనివాసులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
Hyderabad | Mobile Premier League, an online gaming platform signed an MoU with Telangana to set up a game development centre on the sidelines of IndiaJoy 2021, which began here on Tuesday
— ANI (@ANI) November 16, 2021
It was signed in presence of State Minister of Information Technology, KT Rama Rao pic.twitter.com/6eS7iFpMtx
టాస్క్‌తో కూడా
తమ స్వంత సెంటర్ ద్వారా గేమ్స్‌ని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో మొబైల్ ప్రీమియర్ లీగ్ కలిసి పని చేస్తుంది. టాస్క్‌లో ఉన్న వారికి ఈ స్పోర్ట్స్, గేమ్ డెవలప్‌మెంట్, యానిమేషన్ రంగాల్లో అవసరమైన శిక్షణ అందివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment