గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది.
ఫస్ట్ హాఫ్..
భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది.
ఇంటర్వెల్..
భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు.
ప్రీ క్లైమాక్స్..
ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు.
క్లైమాక్స్..
బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్.
ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
Comments
Please login to add a commentAdd a comment