
అహ్మాదాబాద్ : పబ్‌జీ గేమ్ ఓ 22 ఏళ్ల యువతికి తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచమైన యువకుడు.. తన ఫేస్‌బుక్, మెయిల్‌లను హ్యాక్ చేసి.. పాస్‌వర్డ్ రీసెట్ చేయాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లో ఓగ్నాజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి గత కొంత కాలంగా తన స్నేహితురాలితో కలిసి పబ్‌జీ గేమ్ ఆడుతోంది. (చదవండి : ‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే..)
ఈ క్రమంలో తన స్నేహితురాలి ద్వారా జితేంద్ర అనే యువకుడు బాధితురాలికి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడంతో ఫోన్ కాల్ ద్వారా తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత జితేంద్ర అసభ్యకర డిమాండ్ల చేయడం ప్రారంభించడంతో, యువతి అతని ఫోన్‌కాల్‌కు స్పందించడం ఆపేసింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు.. యువతి ఫేస్‌బుక్, మెయిల్ పాస్‌వర్డలను హ్యాక్ చేశాడు.
విషయం తెలుసుకున్న యువతి.. తన పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని కోరగా.. రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. జూన్ 2వ తేదీన అమ్మాయికి ఫోన్ చేసి.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని జితేంద్ర బ్లాక్ మెయిల్‌కు దిగారు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన యువతి. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.