PUBG Mobile India: ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్ - Sakshi
Sakshi News home page

ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్

Published Fri, Nov 27 2020 11:57 AM | Last Updated on Fri, Nov 27 2020 2:53 PM

PUBG Mobile India Coming With 3 New Features That Will Be Only For Indian Gamers - Sakshi

పబ్జీ గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతకి మంచి కిక్ ఇచ్చే గేమ్ గా పాపులరైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పబ్జీని భారత ప్రభుత్వం సెప్టెంబరు 2న నిషేధించింది. అప్పటి నుంచి ఈ గేమ్ కోసం ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ను "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి లాంచ్ చేయనున్నారు. అయితే, గేమింగ్ యాప్ గురుంచి వస్తున్నా వార్తలు వారిలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పుడు, తాజాగా మరో వార్త బయటకి వచ్చింది. "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న యాప్ లో కొత్తగా 3 ఫీచర్లు తీసుకొస్తున్నారని సమాచారం. ఈ ఫీచర్లు భారతీయ పబ్జి గేమర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటాయి. (చదవండి: పబ్‌జీ లవర్స్‌కి గుడ్ న్యూస్)
 
పబ్జిలో రాబోయే 3 ఫీచర్లు

  • "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో వస్తున్న యాప్లో పాత్రలు ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండవు. 
  •  గ్లోబల్ లేదా కొరియన్ వెర్షన్ వలె కాకుండా దీనిలో గ్రీన్ హీట్ ఎఫెక్టులు రానున్నాయి.
  •  యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి ఆట సమయంలో పరిమితిని ఉంచే సెట్టింగ్స్ సహా అనుకూలించే కంటెంట్ ను కలిగి ఉంటుంది.  

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం, పబ్జీ మొబైల్ ఇండియా డిసెంబర్ మొదటి వారంలో అధికారికంగా విడుదల కానుంది. అయితే, పబ్జీ యొక్క ఇండియన్ వెర్షన్ భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత మాత్రమే విడుదల అవుతుంది. భారతదేశంలో మొబైల్ గేమ్ యొక్క అధికారిక నమోదుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం పబ్జి మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ. కొత్త సంస్థ చెల్లుబాటు కోసం కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్(సిఐఎన్)తో మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్డ్ చేసుకుంది. దీని యొక్క రిజిస్టర్డ్ కార్యాలయం బెంగళూరులో ఉంది. "పబ్జీ మొబైల్ ఇండియా" యాప్ ను ఐఫోన్ యూజర్లకంటే ముందుగానే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement