మొదటి వారంలోనే 100 మిలియన్ల డౌన్‌లోడ్లు! | Call of Duty Mobile Makes Record Downloads in First Week | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ‘కాల్‌ ఆఫ్‌ డ్యూటీ: మొబైల్‌’ డౌన్‌లోడ్స్‌

Published Thu, Oct 10 2019 4:22 PM | Last Updated on Thu, Oct 10 2019 6:04 PM

Call of Duty Mobile Makes Record Downloads in First Week - Sakshi

నేటి డిజిటల్‌ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్‌ ఆడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. బ్లూవేల్‌, పబ్‌ జీ వంటి డేంజరస్‌ గేమ్స్‌ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా.. వాటికి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా  కాల్‌ ఆఫ్‌ డ్యూటీ: మొబైల్‌ పేరిట మరో సరికొత్త గేమ్‌ ప్లే స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ సాధించిన తొలి గేమ్‌గా రికార్డుకెక్కింది. టిమీ స్టూడియోస్‌ డెవలప్‌ చేసిన ఈ గేమ్‌ హవా ఇలాగే కొనసాగితే.. ప్రత్యర్థి కంపెనీలు పతనం కావడం ఖాయమని విశ్లేషణా సంస్థ సెన్సార్‌ టవర్‌ పేర్కొంది. 

ఈ మేరకు ఐఓఎస్‌లో 56.9 మిలియన్‌, ఆండ్రాయిడ్‌లో 45.3 మిలియన్‌ డౌన్‌లోడ్లు సాధించిన కాల్‌ ఆఫ్ డ్యూటీ ఆయా ప్లాట్‌ఫాంలలో వరుసగా 9.1 మిలియన్‌, 8.3 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టిందని తెలిపింది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో లాంచ్‌ కాకముందే రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్‌ సాధించిన ఈ గేమ్‌.. అక్కడ కూడా లాంచ్‌ అయితే గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేసింది. ఫస్ట్‌ పర్సన్‌ షూటర్‌ గేమ్‌గా రూపొందిన ఈ మొబైల్‌ గేమ్‌ అక్టోబరు 1న విడుదలైందన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement