దేశంలో యువతను ఎంతగానో ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది పబ్‌జీ గేమ్(PUBG Game). అయితే ఎంత ఆదరణ పొందిందో అంతే స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గేమ్‌కు బానిసలా మారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్‌జీ గేమ్‌ను బ్యాన్ చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని బీజీఎంఐ(BGMI)గా మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. అయితే యాప్ నిర్వాహకులకు తాజాగా మరో సారి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది.
అసలేం జరిగింది..
క్రాఫ్టాన్ కంపెనీ బ్యాన్ అయిన పబ్‌జీని బీజీఎంఐ (BGMI) గేమ్‌గా మార్పు చేసి జూన్ 2021 రీలాంచ్ చేసింది. అతి తక్కువ కాలంలో ఈ గేమ్ పాపులర్ కావడంతో పాటు గూగూల్ ప్లేస్టోర్‌లో టాప్ 10 గేమింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ రిజిష్టర్డ్ యూజర్లను పొందినట్లు బీజీఎంఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. అంతలో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ని కూడా బ్యాన్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గూగుల్, ఆపిల్ సంస్థలు బీజీఎంఐ గేమ్‌ని తమ సంబంధిత యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాయి. ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యాన్‌కి గల కారణాన్ని ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు.
చదవండి: Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment