Google Play
-
గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ.. ఏకమైన 40 భారతీయ కంపెనీలు!
Google Play Billing System: టెక్ దిగ్గజం గూగుల్ (Google)కు వ్యతిరేతికంగా 40 భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలు ఏకమయ్యాయి. గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ను సవాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఆధ్వర్యంలో సామూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్‌కు చెందిన GPBS ప్రకారం.. గూగుల్ ప్లేలోని యాప్ కొనుగోళ్లన్నీ తమ చెల్లింపు గేట్‌వే ద్వారానే జరగాలి. ఈ లావాదేవీలపై గూగుల్ భారీగా 30 శాతం కమీషన్ విధిస్తోంది. అయితే భారత్‌లో GPBSకి బదులుగా యూజర్ చాయిస్ బిల్లింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవలి తీర్పులో గూగుల్‌ను ఆదేశించింది. చట్టపరమైన చర్యలు! మీడియా నివేదికల ప్రకారం.. గూగుల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వారి ఆందోళనల తీవ్రతను సూచిస్తూ గూగుల్‌పై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ టాస్క్‌ఫోర్స్ ముందు హాజరై వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ టాస్క్‌ఫోర్స్‌లో గూగుల్ కూడా ప్రతినిధి స్థానాన్ని కలిగి ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. (సీఎఫ్‌వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!) ఇక మరో అంశంలో సీసీఐ విధించిన రూ. 936.44 కోట్ల పెనాల్టీపై గూగుల్ అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నవంబర్ 28న విచారించనున్నట్లు ప్రకటించింది. ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి దాని ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. -
గుడ్ న్యూస్.. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రివార్డ్స్ వస్తాయ్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రివార్డ్ పాయింట్స్ విధానాన్ని భారత్‌లో వచ్చే వారం పరిచయం చేయనుంది. గూగుల్ ప్లే (Google Play స్టోర్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల సంఖ్యను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఈ పాయింట్స్ ప్రోగామ్ గూగుల్ ప్లే స్టోర్‌లో కస్టమర్లు చేసే ప్రతి డౌన్లోడ్ ద్వారా వారు పాయింట్లను సంపాదించవచ్చు. ఆ తర్వాత వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో ఇన్–యాప్ ఐటెమ్స్, యాప్స్, గేమ్స్, సబ్స్క్రిప్షన్స్ కోసం జరిపే కొనుగోళ్లలో ఈ పాయింట్స్‌ను వినియోగదార్లు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ప్రోగాం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యాప్‌లు, గేమ్‌ల డెవలపర్లతో ఒప్పందం కుదర్చుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే 28 దేశాల్లో గూగుల్ ప్లే పాయింట్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. చదవండి: భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!! -
ఆ గేమ్ కూడా పాయే.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు!
దేశంలో యువతను ఎంతగానో ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది పబ్జీ గేమ్(PUBG Game). అయితే ఎంత ఆదరణ పొందిందో అంతే స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గేమ్‌కు బానిసలా మారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని బీజీఎంఐ(BGMI)గా మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. అయితే యాప్ నిర్వాహకులకు తాజాగా మరో సారి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. అసలేం జరిగింది.. క్రాఫ్టాన్ కంపెనీ బ్యాన్ అయిన పబ్జీని బీజీఎంఐ (BGMI) గేమ్‌గా మార్పు చేసి జూన్ 2021 రీలాంచ్ చేసింది. అతి తక్కువ కాలంలో ఈ గేమ్ పాపులర్ కావడంతో పాటు గూగూల్ ప్లేస్టోర్‌లో టాప్ 10 గేమింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ రిజిష్టర్డ్ యూజర్లను పొందినట్లు బీజీఎంఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. అంతలో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ని కూడా బ్యాన్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గూగుల్, ఆపిల్ సంస్థలు బీజీఎంఐ గేమ్‌ని తమ సంబంధిత యాప్ స్టోర్ల నుంచి తొలగించాయి. ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యాన్‌కి గల కారణాన్ని ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. చదవండి: Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
నిషేధిత 59 చైనీస్ యాప్స్ అవుట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ భారత్‌లోని తమ యాప్‌స్టోర్స్ నుంచి తొలగించాయి. దీంతో భారత్‌లోని మొబైల్ ఫోన్ యూజర్లకు ఇవి అందుబాటులో ఉండవు. దేశ సమగ్రతకు, భద్రతకు ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ తమ యాప్ స్టోర్ నుంచి వీటిని అందుబాటులో లేకుండా చేశాయి. తాత్కాలికంగా భారత ప్లే స్టోర్ విభాగంలో పలు యాప్స్‌ను బ్లాక్ చేసినట్లు గూగుల్ తెలిపింది. నిషేధం ఎదుర్కొంటున్న వాటిల్లో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, ఉయ్‌చాట్, క్యామ్‌స్కానర్, మి కమ్యూనిటీ మొదలైనవి ఉన్నాయి. చట్టపరమైన చర్యల యోచన లేదు: టిక్‌టాక్ .. ప్రభుత్వ నిషేధంపై టిక్‌టాక్ స్పందించింది. దీనికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. ‘అలాంటి ప్రణాళికలేమీ మాకు లేవు. ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే మేం పనిచేస్తాం. యూజర్ల డేటా భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తాం‘ అని టిక్‌టాక్ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, నిషేధిత యాప్స్‌లో ఒకటైన బిగో లైవ్ కూడా స్పందించింది. ‘మేం భారత ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తాం. దీనిపై చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం‘ అని పేర్కొంది. నియామకాల ప్రణాళికల్లో చింగారీ చైనీస్ యాప్‌లపై నిషేధంతో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా యాప్స్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అనేక రెట్లు పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను వచ్చే కొద్ది నెలల్లో 200కి పెంచుకోవాలని యోచిస్తున్నట్లు దేశీ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ చింగారీ వెల్లడించింది. -
అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్
ముంబై: టిక్‌టాక్‌కు పోటీగా అవతరించిన మిట్రాన్ యాప్ అనతి కాలంలోనే యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల భద్రతా సమస్యల కారణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే సంస్థలకు ఏదయినా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించడానికి సిద్దమేనని గూగుల్, ఆండ్రాయిడ్లు ప్రకటించాయి. మిట్రాన్ యాప్ కేవలం ఒక నెలలోనే 50 లక్షల డౌన్లోడ్లతో యూజర్లను అలరించింది. ఈ యాప్‌కు సంబంధించిన సమస్యకు తాము పరిష్కారం చూపించామని ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే పేర్కొంటు.. అయితే తాము సూచించిన నిబంధనలను పాటించాలని వైస్ ప్రెసిడెంట్ సమీర్ సామత్ పేర్కొన్నారు. ఇటీవల తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మిట్రాన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. కాగా సైబర్ నిపుణులు సైతం వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు మిట్రాన్ యాప్ డెవలపర్స్ ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని.. యాప్‌ను తొలగించాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విపరీతమైన పోటీ కారణంగా యాప్‌లు నిబంధనలు పాటించడం లేదని.. తాము సమాజానికి ఉపయోగపడే నిబంధనలు రూపొందించామని గూగుల్ పేర్కొంది. ప్లే స్టోర్‌లో ఉన్న వివిధ యాప్‌లు గూగుల్ రూపొందించిన నియమాలను పాలించాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది. చదవండి: ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్ -
గూగుల్ ప్లే యాప్స్‌పై సంచలన రిపోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఫేస్బుక్ డేటా లీక్ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా తాజాగా ఓ సంచలన రిపోర్టు యూజర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గూగుల్ పిల్లలను గోప్యతా చట్టాలను ఉల్లఘింస్తోందనే ఆరోపణలుమరోసారి చెలరేగాయి. గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తగత వివరాలను అక్రమంగా ట్రాక్ అవుతోంది. ముఖ్యంగా బాలల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోంది. అమెరికా ఫెడరల్ చట్టంలోని పిల్లల ఆన్లైన్ గోప్యతా రక్షణ చట్టం ( చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు నిర్వహించిన ఒక ఇండిపెండెంట్ సర్వే ఈ షాకింగ్ అంశాలను వెల్లడించింది. ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (ఐసిఎస్ఐ) నివేదించిన సమాచారం ప్రకారం, పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని మొత్తం 5,855 ఆండ్రాయిడ్ యాప్స్‌ను పరిశీలించింది. వీటిలో సగానికి (3,337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్ అమెరికా గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా తస్కరిస్తున్నాయని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సుమారు 256 యాప్స్ 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్ డేటాను కూడా సేకరించిందట. ఇంత కీలకమైన వ్యక్తిగత వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్టు పేర్కొంది. వీటిలో పేర్లు, ఇమెయిల్, చిరునామాలు, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు అందుబాటులో లేరని తెలిపింది. గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫాం యూ ట్యూబ్ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ కోపా నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్ ఎడ్వకసీ గ్రూప్స్ ఆరోపణల నేపథ్యంలో ఈ అధ్యయనం చేసింది. -
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్లు
మెసేజింగ్ యాప్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న వాట్సాప్ రోజుకో కొత్త రకం ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను అలరిస్తూ ఉంది. తాజాగా ఆండ్రాయిడ్ వాట్సాప్‌కు కొత్త బీటా వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ బీటా వెర్షన్లో రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లను లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మెసేజ్ రికార్డు చేస్తున్న సేపు రికార్డు బటన్‌ను పట్టుకునే ఉండకుండా.. వాయిస్ మెసేజ్‌లను తేలికగా రికార్డు చేయొచ్చు. అంతేకాకుండా రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లను డెలివరీ చేసేముందే యూజర్లు ప్లే చేసే వినే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ కోసం 2.18.102ను వాట్సాప్ అప్డేట్ చేసింది. వాయిస్ రికార్డింగ్‌లను లాక్ చేసుకునే ఫీచర్‌ను ఐఓఎస్ ఐఫోన్లకు గతేడాది నవంబర్లోనే తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. మీ వాయిస్ మెసేజ్‌లను లాక్ చేయాలనుకుంటే, మిక్ ఐకాన్‌ను 0.5 సెకన్లు పట్టుకుని, లాక్ బటన్ వైపు మీ చేతి వేళ్లను స్లైడ్ చేయాలి. ఒక్కసారి లాక్ అయిన వాయిస్ రికార్డింగ్‌ను తేలికగా సెండ్ బటన్‌తో పంపవచ్చు. అంటే మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ లు పంపాలనుకున్నప్పుడు రికార్డు బటన్ మీద అలాగే ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పనిలేకుండా ఒకసారి రికార్డింగ్ లాక్ చేసి పెడితే.. మాట్లాడడం పూర్తయిన తర్వాత దాన్ని అన్‌లాక్ చేసుకునే విధంగా ఈ లాక్డ్ రికార్డింగ్ సదుపాయం ఉపయోగపడుతోంది. లాక్ రికార్డింగ్ ఫీచర్, వాయిస్ మెసేజ్‌లను పంపే ముందు వినే సౌకర్యం కోసం వాట్సాప్ బీటా యూజర్లు ఆండ్రాయిడ్ వెర్షన్ 2.18.102ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని WABetaInfo రిపోర్టు చేసింది. గూగుల్ ప్లేలో బీటా టెస్టర్ల వద్ద ఇది అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. -
గూగుల్ ప్లే డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?
యాప్ డౌన్ లోడ్ లలో గూగుల్ ప్లే స్టోర్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2016 మొదటి త్రైమాసికంలో దాదాపు వెయ్యికోట్లకు పైగా యాప్ లు గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ అయినట్టు సెన్సార్ టవర్ డేటా రిపోర్టులో వెల్లడైంది. 2016 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ నమోదైన యాప్ డౌన్ లోడ్ ల సంఖ్యను తెలుపుతూ ఈ రిపోర్టు విడుదలైంది. గూగుల్ ప్లే యాప్ డౌన్ లోడ్స్ లో వాట్సప్, ఫేస్ బుక్ మెసెంజర్, స్నాప్ చాట్ లు టాప్ 10 లో ప్లేస్ ను దక్కించుకోగా, మెసెంజర్, పియానో టైల్స్ 2, ఫేస్ బుక్, యూట్యూబ్, కలర్ స్విచ్ లు టాప్ 5 యాప్ లుగా నిలిచాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన యాప్ డౌన్ లోడ్ సంఖ్య కంటే 6.7 శాతం పెరిగిందని రిపోర్టు తెలిపింది. 2015 మొదటి త్రైమాసికంలో 10.4 బిలియన్ యాప్ లనే డౌన్ లోడ్ చేసుకున్నారని నివేదించింది. వరల్డ్ వైడ్ టాప్ 20 ఐఓఎస్ ల జాబితా లో వాట్సాప్, స్నాప్ చాట్ లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. వాట్సప్ యాప్ 100 మిలియన్ల మార్కును దాటిందని గూగుల్ తెలిపింది. ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా అంతే క్రేజ్ ఉందని, దీన్ని దాదాపు 90 మిలియన్ల డౌన్ లోడ్ జరిగిందని వెల్లడించింది. ఫేస్ బుక్ ను మెసెంజర్ యాప్ కంటే కొంచెం తక్కువగా 80 మిలియన్ డౌన్ లోడ్స్ ను నమోదుచేసిందని రిపోర్టు నివేదించింది.అలాగే గేమింగ్ యాప్ ల్లో పియానో టైల్స్ 2, క్యాండీ క్రష్ జెల్లీ సాగ, ట్రాఫిక్ రైడర్ కూడా తమ హవాను కొనసాగిస్తున్నాయి. కాగా ఈ డౌన్ లోడ్ ల సంఖ్యను ఒక్కో వినియోగదారుడు ఒక్కో డౌన్ లోడ్ ఆధారంగా లెక్కిస్తారు. ఒకే యాప్ ను ఒకే వినియోగదారుడు వేర్వేరు డివైజ్ లో డౌన్ లోడ్ చేసుకోవడాన్ని గూగుల్ పరిగణనలోకి తీసుకోదు. థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ స్టోర్స్ డౌన్ లోడ్ అంచనాలను కూడా వీరు లెక్కించరు. డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ అయ్యే యాప్ ల ఆధారంగానే ఈ సంఖ్యను లెక్కించడం జరుగుతుంది. -
స్నాప్ డీల్‌కు ఎసరు పెట్టిన ఆమీర్ ’అసహనం’
-
'ఆమిర్ వ్యాఖ్యలతో మాకేం సంబంధం లేదు'
న్యూఢిల్లీ: భారత్ లో పెరుగుతున్న అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ కు ఈ వ్యాఖ్యల సెగ తగిలింది. దేశంలో చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్ డీల్ యాప్ పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్ డీల్ యాప్ కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. వెంటనే ఆమిర్ ఖాన్ ను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మొదట మౌనంగా స్నాప్ డీల్ సంస్థ ఎట్టకేలకు బుధవారం పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఆమిర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలలో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ, సంబంధం కానీ లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్థ.. సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేం భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో పది లక్షలమంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారుచేయాలన్న పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం' అని స్నాప్ డీల్ తెలిపింది. -
గూగుల్ నెక్సస్5 వచ్చేసింది..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తయారు చేసిన నెక్సస్ 5 స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తమ ప్లేస్టోర్ ద్వారా ఆన్లైన్లో వీటి విక్రయాలు ప్రారంభించింది. 16 జీబీ మోడల్ ధర రూ. 28,999గాను, 32 జీబీ రేటు రూ. 32,999గా నిర్ణయించింది. 4.95 అంగుళాల స్క్రీన్ ఉండే నెక్సస్ 5.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. క్వాల్కామ్కి చెందిన శ్నాప్డ్రాగన్ 2.26 గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్, 4జీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, విక్రయానికి పెట్టిన కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయి అవుటాఫ్ స్టాక్ మెసేజ్ దర్శనమివ్వడం ఇతర కొనుగోలుదారులను నిరాశపర్చింది. మరోవైపు, నెక్సస్ 7 పేరుతో ఏడు అంగుళాల ట్యాబ్లెట్ పీసీలను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. వీటి ధర వైఫై వెర్షన్లో 16 జీబీ మోడల్‌కి రూ. 20,999, 32 జీబీకి రూ. 23,999గా ఉంటుంది. ఎల్టీఈ వెర్షన్లో 32 జీబీ మోడల్ ధర రూ. 27,999గా ఉంటుంది. ట్యాబ్లెట్ పీసీలో క్వాడ్‌కోర్ క్వాల్కామ్ శ్నాప్డ్రాగన్ ఎస్4 ప్రొ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5 ఎంపీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి రవాణా ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది.