గూగుల్ నెక్సస్5 వచ్చేసింది.. | Google's Nexus 5, Nexus 7 start selling on Google Play | Sakshi
Sakshi News home page

గూగుల్ నెక్సస్5 వచ్చేసింది..

Published Thu, Nov 21 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

గూగుల్ నెక్సస్5 వచ్చేసింది..

గూగుల్ నెక్సస్5 వచ్చేసింది..

 న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తయారు చేసిన నెక్సస్ 5 స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తమ ప్లేస్టోర్ ద్వారా ఆన్‌లైన్లో వీటి విక్రయాలు ప్రారంభించింది. 16 జీబీ మోడల్ ధర రూ. 28,999గాను, 32 జీబీ రేటు రూ. 32,999గా  నిర్ణయించింది.  4.95 అంగుళాల స్క్రీన్ ఉండే నెక్సస్ 5.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. క్వాల్‌కామ్‌కి చెందిన శ్నాప్‌డ్రాగన్ 2.26 గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్, 4జీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, విక్రయానికి పెట్టిన కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయి అవుటాఫ్ స్టాక్ మెసేజ్ దర్శనమివ్వడం ఇతర కొనుగోలుదారులను నిరాశపర్చింది.
 
 మరోవైపు, నెక్సస్ 7 పేరుతో ఏడు అంగుళాల ట్యాబ్లెట్ పీసీలను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. వీటి ధర వైఫై వెర్షన్‌లో 16 జీబీ మోడల్‌కి రూ. 20,999, 32 జీబీకి రూ. 23,999గా ఉంటుంది. ఎల్‌టీఈ వెర్షన్‌లో 32 జీబీ మోడల్ ధర రూ. 27,999గా ఉంటుంది. ట్యాబ్లెట్ పీసీలో క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ శ్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రొ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5 ఎంపీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి రవాణా ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement