Nexus 7
-
సొంత బ్రాండులో గూగుల్ మరో డివైజ్
సొంత బ్రాండుతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న గూగుల్, మరో పిక్సెల్ డివైజ్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతుందట. పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ పేర్లతో అక్లోబర్ 4న రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్న గూగుల్, అనంతరం కొన్ని వారాల్లోనే కంపెనీ కొత్త పిక్సెల్ టాబ్లెట్నూ వినియోగదారుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. 2013లో లాంచ్ చేసిన నెక్షస్ 7 డివైజ్‌లకు రిప్లేస్గా ఈ టాబ్లెట్‌ను తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త గూగుల్ టాబ్లెట్, నెక్సస్ స్మార్ట్ఫోన్ల మాదిరిగానే పిక్సెల్ సిరీస్ డివైజ్ రీబ్రాండెడ్ రూపంలో రానుంది. 4జీబీ ర్యామ్‌తో ఈ డివైజ్‌ను హువాయ్ తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. గూగుల్ హువాయ్ 4 జీబీ ర్యామ్‌తో ఏడు అంగుళాల టాబ్లెట్‌ను ఈ ఏడాది ముగింపుకు ముందే లాంచ్ చేయబోతుందని ఫోన్ లీకర్, అమెరికన్ బ్లాగర్ ఈవన్ బ్లాస్ ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన మిగతా ఏ వివరాలను ఆయన తెలుపలేదు. ఈ చైనీస్ దిగ్గజం హువాయ్, గూగుల్‌తో పనిచేయడం మొదటిసారేమి కాదు. గతేడాదే నెక్షస్ 6పీ డివైజ్‌లను హువాయ్ తయారుచేసింది. అయితే ప్రస్తుతం కొత్తగా రూపొందించబోతున్న పిక్సెల్ టాబ్లెట్ ఇప్పడున్న వాటికంటే పెద్దదిగా ఉండబోతుందట. మొత్తం మెటల్ బాడీతో, ఎక్కువ రెజుల్యూషన్ 1440పీ స్క్రీన్‌తో ఇది యూజర్ల ముందుకు రాబోతుంది. కొన్ని నెలల క్రితమే ఆవిష్కరించిన తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ నోగట్తో ఈ టాబ్లెట్ పనిచేయనుంది. ఈ టాబ్లెట్‌కు ముందు మార్కెట్లోకి వచ్చే రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్లు.. మార్లిన్, సెయిల్ఫిష్ కోడ్‌నేమ్‌తో రాబోతున్నాయి. నెక్షస్ 5ఎక్స్, నెక్షస్ 6పీలను అవి రీప్లేస్ చేయబోతున్నాయి. 5, 5.5 అంగుళాల పరిమాణంలో తాకే తెర ఉండే ఈ ఫోన్ల అంతర్గత స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ, 128 జీబీగా ఉంటుందట. Google's Huawei-built 7-inch tablet, with 4GB RAM, on track for release before the end of the year. — Evan Blass (@evleaks) 5 September 2016 -
గూగుల్ నెక్సస్5 వచ్చేసింది..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తయారు చేసిన నెక్సస్ 5 స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తమ ప్లేస్టోర్ ద్వారా ఆన్లైన్లో వీటి విక్రయాలు ప్రారంభించింది. 16 జీబీ మోడల్ ధర రూ. 28,999గాను, 32 జీబీ రేటు రూ. 32,999గా నిర్ణయించింది. 4.95 అంగుళాల స్క్రీన్ ఉండే నెక్సస్ 5.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. క్వాల్కామ్కి చెందిన శ్నాప్డ్రాగన్ 2.26 గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్, 4జీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, విక్రయానికి పెట్టిన కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయి అవుటాఫ్ స్టాక్ మెసేజ్ దర్శనమివ్వడం ఇతర కొనుగోలుదారులను నిరాశపర్చింది. మరోవైపు, నెక్సస్ 7 పేరుతో ఏడు అంగుళాల ట్యాబ్లెట్ పీసీలను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. వీటి ధర వైఫై వెర్షన్లో 16 జీబీ మోడల్‌కి రూ. 20,999, 32 జీబీకి రూ. 23,999గా ఉంటుంది. ఎల్టీఈ వెర్షన్లో 32 జీబీ మోడల్ ధర రూ. 27,999గా ఉంటుంది. ట్యాబ్లెట్ పీసీలో క్వాడ్‌కోర్ క్వాల్కామ్ శ్నాప్డ్రాగన్ ఎస్4 ప్రొ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5 ఎంపీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి రవాణా ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది.