గూగుల్ ప్లే డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా? | Google Play Registered 11.1 Billion App Downloads in Q1 2016: Report | Sakshi
Sakshi News home page

గూగుల్ ప్లే డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?

Published Wed, Apr 20 2016 12:54 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

గూగుల్ ప్లే డౌన్లోడ్స్   ఎన్నో తెలుసా? - Sakshi

గూగుల్ ప్లే డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?

యాప్ డౌన్ లోడ్ లలో  గూగుల్ ప్లే స్టోర్  కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.   2016 మొదటి త్రైమాసికంలో దాదాపు  వెయ్యికోట్లకు పైగా యాప్ లు గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ అయినట్టు సెన్సార్ టవర్ డేటా రిపోర్టులో వెల్లడైంది. 2016 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ నమోదైన యాప్ డౌన్ లోడ్ ల సంఖ్యను తెలుపుతూ ఈ రిపోర్టు విడుదలైంది. గూగుల్ ప్లే యాప్ డౌన్ లోడ్స్ లో వాట్సప్, ఫేస్ బుక్ మెసెంజర్, స్నాప్ చాట్ లు   టాప్ 10 లో ప్లేస్ ను దక్కించుకోగా,  మెసెంజర్, పియానో టైల్స్ 2, ఫేస్ బుక్, యూట్యూబ్, కలర్ స్విచ్ లు టాప్ 5 యాప్  లుగా   నిలిచాయి.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన యాప్ డౌన్ లోడ్ సంఖ్య కంటే 6.7 శాతం పెరిగిందని రిపోర్టు తెలిపింది. 2015 మొదటి త్రైమాసికంలో 10.4 బిలియన్ యాప్ లనే డౌన్ లోడ్ చేసుకున్నారని నివేదించింది. వరల్డ్ వైడ్ టాప్ 20 ఐఓఎస్ ల జాబితా లో వాట్సాప్, స్నాప్ చాట్ లు ఆరు, ఏడు స్థానాల్లో  నిలిచాయి.  వాట్సప్ యాప్ 100 మిలియన్ల మార్కును దాటిందని గూగుల్ తెలిపింది. ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా అంతే క్రేజ్ ఉందని, దీన్ని దాదాపు 90 మిలియన్ల డౌన్ లోడ్ జరిగిందని వెల్లడించింది. ఫేస్ బుక్ ను మెసెంజర్ యాప్ కంటే కొంచెం తక్కువగా 80 మిలియన్ డౌన్ లోడ్స్ ను నమోదుచేసిందని రిపోర్టు నివేదించింది.అలాగే గేమింగ్ యాప్ ల్లో పియానో టైల్స్ 2, క్యాండీ క్రష్ జెల్లీ సాగ, ట్రాఫిక్ రైడర్  కూడా తమ హవాను కొనసాగిస్తున్నాయి.  

కాగా  ఈ డౌన్ లోడ్ ల సంఖ్యను ఒక్కో వినియోగదారుడు ఒక్కో డౌన్ లోడ్ ఆధారంగా లెక్కిస్తారు. ఒకే యాప్ ను ఒకే వినియోగదారుడు వేర్వేరు డివైజ్ లో డౌన్ లోడ్ చేసుకోవడాన్ని గూగుల్ పరిగణనలోకి తీసుకోదు. థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ స్టోర్స్ డౌన్ లోడ్ అంచనాలను కూడా వీరు లెక్కించరు.  డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ అయ్యే  యాప్ ల ఆధారంగానే ఈ సంఖ్యను లెక్కించడం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement